Naga Chaitanya : సమంత – నాగచైతన్య జంట గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఏమాయ చేసావే సినిమాతో మొదలైన వీరి ప్రయాణం… ఆ తర్వాత ప్రేమ, పెళ్లి, విడాకులు గా మారింది. ఒకప్పుడు టాలీవుడ్ మోస్ట్ లవ్డ్ కపుల్స్ లో ఒకరైన సమంత – నాగచైతన్యలు విడిపోవడం అనేది తెలుగు ప్రేక్షకులకు జీర్ణించుకోలేని విషయం. ముఖ్యంగా ఈ క్యూట్ కపుల్ కి సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది. ఇప్పటికీ వీరు విడిపోయి సంవత్సరం గడిచినప్పటికీ సోషల్ మీడియాలో వీళ్ళ గురించే చర్చ నడుస్తుంది. నిత్యం ఏదో విధంగా సామ్, చై వార్తల్లో నిలుస్తున్నారు. గత ఏడాది అక్టోబర్ 2న వీరిద్దరూ విడిపోతున్నట్లు ప్రకటించిన… కానీ ఎందుకు విడిపోతున్నారనేది మాత్రం స్పష్టతనివ్వలేదు.
సమంత మయోసైటిస్ అనే ఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్నే సోషల్ మీడియా వేదికగా అందరికీ ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది సామ్. దీంతో ఆమె అభిమానులతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా సామ్ ఆరోగ్యం గురించి పోస్ట్ లు పెట్టారు. ఈ తరుణంలోనే సామ్ మాజీ భర్త నాగ చైతన్య స్పందించకపోవడంపై పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం కర్టసీ కోసం అయినా ఒక ట్వీట్ వేస్తే బాగుండేదని అందరూ చర్చించుకుంటున్నారు. అయితే జీవితం అంటే సోషల్ మీడియా మాత్రమే కాదని… అక్కడ స్పందిస్తేనే పట్టించుకున్నట్లు కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
సమంత ఆరోగ్యం గురించి తెలిసిన వెంటనే నాగచైతన్య రెస్సాండ్ అయ్యారట. ఆమె అప్పుడు చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వెళ్లి మరీ ధైర్యం చెప్పారట. అంతే కాకుండా ఏ మాత్రం ఇబ్బంది ఉన్నా తనకు కాల్ చేయమని సూచించారని వారి సన్నిహితులు చెబుతున్నారు. అక్కినేని అఖిల్ బాబు కూడా సోషల్ మీడియాలో డియర్ సామ్ నువ్వు దైర్యంగా ఉండాలంటూ పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.