Fahadh Faasil : పుష్ప సినిమాతో బన్ని, సుకుమార్ దేశమంతటా ప్రేక్షకులని మాయ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఆ సినిమాలో పాటలు, డైలాగ్స్ ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. పుష్ప 2 సినిమా కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. పుష్ప సెకండ్ పార్ట్ షూటింగ్ ఫుల్ స్వింగ్ లో జరుగుతోంది. ఆల్రెడీ సెకండ్ పార్ట్ గ్లింప్స్, పోస్టర్ రిలీజ్ అయ్యి సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేశాయి.
ఇక పుష్ప సినిమాలో మలయాళం స్టార్ ఫహద్ ఫాజిల్ భన్వర్ సింగ్ షెకావత్ పోలీసాఫీసర్ క్యారెక్టర్ చేసిన సంగతి తెలిసిందే. పుష్ప 1 సినిమా లాస్ట్ లో ఒక 20 నిముషాలు కనపడి భన్వర్ సింగ్ షెకావత్ క్యారెక్టర్ లో ఫహద్ అదరగొట్టాడు. క్లైమాక్స్ సీన్ కూడా అల్లు అర్జున్, ఫహద్ మధ్యే ఉంటుంది. దీంతో ఈ క్యారెక్టర్ కి బాగా పేరు వచ్చి సెకండ్ పార్ట్ లో ఫహద్ బన్నీపై ఎలా రివెంజ్ తీర్చుకుంటాడా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తాజాగా పుష్ప 2 నుంచి ఫహద్ ఫాజిల్ భన్వర్ సింగ్ షెకావత్ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. ఫహద్ గుండుతో.. బ్లాక్ కళ్ళజోడు పెట్టుకొని.. సిగరెట్ కలుస్తూ పార్ట్ 1లో కంటే స్టైలిష్ గా పవర్ ఫుల్ గా ఉన్నాడు. విలన్ ఇంత పవర్ ఫుల్ గా చూపిస్తే ఇంక బన్నీని ఎంత పవర్ ఫుల్ గా చుపిస్తారేమో అని అభిమానులు, ప్రేక్షకులు భావిస్తున్నారు. చిత్రయూనిట్ రిలీజ్ చేసిన ఫహద్ ఫస్ట్ లుక్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఇక అభిమానులు, నెటిజన్లు ఫహద్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.