Akkineni Nagarjuna నాగార్జున తన కెరియర్లో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించారు. అయితే అందులో 100 రోజులు ఆడి రికార్డ్ సృష్టించిన సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. అక్కినేని అమల నగర్జునకి జంటగా నటించిన చిత్రం శివ. 1989లో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేసింది. 1989లో వచ్చిన ప్రేమ కథ చిత్రం గీతాంజలి. ఈ చిత్రం యువ ప్రేక్షకుల్ని ఎంతగా అలరించిందో కలెక్షన్ పరంగా కూడా అంతే వసూలను సాధించింది.
రమ్యకృష్ణ, సౌందర్య, నాగార్జున నటించిన చిత్రం హలో బ్రదర్. 1994లో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ అందుకుంది. నాగర్జునకి టబు జంటగా 1996లో వచ్చిన నిన్నే పెళ్ళాడతా. నాగార్జున కెరీర్ ను మలుపు తిప్పింది చిత్రం. 1997 లో వచ్చిన అన్నమయ్య సినిమా అప్పట్లో బాక్సాఫీస్ దగ్గర ఒక సంచలనం అనే చెప్పాలి. 2002లో వచ్చిన మన్మధుడు నాగార్జున కెరీర్ లో మరో సంచలనం అనే చెప్పాలి. 2002లో వచ్చిన సంతోషం మరో విజయాన్ని నాగార్జున ఖాతాలో చేర్చింది. 2006లో వచ్చిన శ్రీరామదాసు చిత్రం మరో అన్నమయ్య అని గుర్తుతెచ్చింది. బాక్స్ ఆఫీస్ దగ్గర వసూళ్లపరంగా ఇటు నాగార్జును మరో మెట్టు ఎక్కించింది.
నాగార్జున సాక్షాత్తు శిరిడి సాయిబాబాగా ఆలరించిన చిత్రం శిరిడి సాయి. 2012లో వచ్చిన ఈ చిత్రం అనేది విమర్శకుల ప్రశంసలను అందుకుంది. టెర్రరిస్టులు విమానాన్ని హైజాక్ చేసే నేపథ్యంతో సాగిన గగనం చిత్రం 2011లో వచ్చింది. ఈ చిత్రం నాగార్జున నటనను మరొక మెట్టు ఎక్కించింది. అక్కినేని వారసులంతా కలిసి నటించిన చిత్రం మనం. అక్కినేని నాగేశ్వరరావు చిట్టచివరిగా నటించిన ఈ చిత్రం అనేది 2014లో బాక్సాఫీస్ ను షేక్ చేసింది. తమిళ్ హీరో కార్తీక్ నాగార్జున తమన్నా అనుష్క నటించిన చిత్రం ఊపిరి 2016 లో వచ్చిన ఊపిరి చిత్రం నాగార్జున కెరియర్ లోనే మరొక అద్భుతo.