యంగ్ అండ్ హ్యాపెనింగ్ హీరో శర్వానంద్ నటిస్తోన్న ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ `ఆడవాళ్లు మీకు జోహార్లు`. రష్మిక మందన్న హీరోయిన్. రాధిక, ఊర్వశి, కుష్బు కీలక పాత్రల్లో నటించారు. ఈ సందర్భంగా నటి ఊర్వశి మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు..
ఆడవాళ్లు మీకు జోహార్లు అనే టైటిలే చాలా పాజిటీవ్‌గా ఉంది. టైటిల్ చూడగానే ఆడవారికి ప్రాధాన్యం ఉన్న సినిమా అని అర్ధం అవుతుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి ఫ్రేములో ఐదుగురు మహిళలకి సమానమైన ప్రాధాన్యత కలిగించడమే గొప్ప విషయం. ఎక్కడా కూడా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని అని ఉండదు. సమానమైన ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇలాంటి ఒక స్క్రిప్ట్ రావడమే అరుదు.
ఈ సినిమాలో హీరోకి ఐదుగురు తల్లులు ఉంటారు. అందులో ఒక తల్లి అంటే కొంచెం ఎక్కువ ప్రేమ, అటాచ్ మెంట్ ఉంటుంది అది ఎందుకు? ఆ తల్లి ఎవరు? అనేది సినిమాలో తెలుస్తుంది. భిన్న అభిప్రాయాలు ఉన్న ఐదుగురు తల్లులును ఒప్పించి హీరో తన ప్రేయసిని ఎలా పెళ్లి చేసుకున్నాడు అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.
రాధిక, కుష్బు గారితో ఇప్పటికే చాలా సినిమాల్లో కలిసి నటించాను. రాధిక క్యారెక్టర్ మెచ్యూర్డ్‌గా నిర్ణయాలు తీసుకోవడం అందరికీ మంచి చెడులు చెప్పడం ఇలా ఉంటుంది. నా క్యారెక్టర్ విషయానికి వస్తే చాలా ఎమోషనల్, ఎక్కువగా మట్లాడతాను. అన్నింటికి నా ఒపీనియన్ తీసుకోవాలి అనే మెండితనం ఉంటుంది. అందరిలో నా డెసిషన్ ఫైనల్‌గా ఉండాలి అనుకుంటాను. నాకు నచ్చకపోతే ఏ పని చేయొద్దు అనే పట్టుదలవల్ల ఎలాంటి సమస్యలు వచ్చాయి. వాటిని ఎలా పరిష్కరించారు అనేది ముఖ్యంగా ఉంటుంది.