చాందిని చౌదరి, వశిష్ట సింహా, భరత్‌రాజ్,ఆషు రెడ్డి ముఖ్యతారలుగా రూపొందుతున్న చిత్రం యేవమ్. ప్రకాష్ దంతులూరి . దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి నవదీప్, పవన్ గోపరాజు నిర్మాతలు. ఈ నెల 14న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ప్రీరిలీజ్ వేడుక సోమవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాస్ కదాస్ విశ్వక్‌సేన్, దర్శకుడు సందీప్‌రాజ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా విశ్వక్‌సేన్ మాట్లాడుతూ… హీరో నవదీప్ యాక్టింగ్ చేస్తే రొమాన్ష్ ఎక్కువ, నిర్మాతగా చేస్తే వాయిలెన్స్ ఎక్కువ అని అర్థమైంది. ఈ సీస్పెస్ అనే సంస్థతో నిర్మాతగా టాలెంట్ యంగ్ పీపుల్‌కు నవదీప్ మంచి ఫ్లాట్‌ఫామ్ క్రియేట్ చేశాడు. సాధారణంగా అందరూ సినిమాలు చేసిన తరువాత అందరూ ఆ సినిమాలోని చాలా
తక్కువ మందితో టచ్‌లో వుంటారు. ఇక నేను నటించి రెస్పెక్ట్ చేసే వాళ్లలో చాందిని చౌదరి ఒకరు. టెన్షన్ పడే క్యాండేట్ చాందిని. ఈ సినిమాతో చాందిని కి ఆ భయం పోయింది. ఈ సినిమా ద్వారా ఫీమేల్ సంగీత దర్శకురాలు, ఫీమేల్ ఎడిటర్, ఫీమేల్ ఓరియెంటెడ్ చిత్రానికి పనిచేయడం చాలా ఆనందంగా వుంది. అన్ని రంగాల్లో అమ్మాయిలు వుండాలనేది నా కోరిక. ఈ టీమ్‌ను చూస్తుంటే ముచ్చటేసింది. తప్పకుండా ఈ చిత్రం అందరికి మంచి బ్రేక్‌నివ్వాలి అన్నారు.
పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్