Kevvu Karthik:జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ ప్రోగ్రామ్స్ ద్వారా ఎంతో మంది కమెడియన్లుగా మంచి పేరు సంపాదించారు. వేణు, చలాకీ చంటి, చమ్మక్ చంద్ర, ధన్‌రాజ్ నుంచి సుడిగాలి సుధీర్, గెటప్ శీను, హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్ వరకు ఇలా ఎంతోమంది సినిమాల్లో కూడా మంచి స్థాయికి వెళ్లారు. అలానే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు కెవ్వు కార్తిక్. ఎక్స్‌ట్రా జబర్దస్త్‌లో ప్రస్తుతం టీమ్ లీడర్‌గా ఉన్న కార్తిక్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రకటించాడు కార్తిక్.
“ఒక కొత్త వ్యక్తి మన జీవితంలోకి వస్తే లైఫ్ ఇంకా హ్యాపీగా ఉంటుందని చాలా మంది అంటారు. ఇది అదే కావచ్చు. అలా నా జీవితంలోకి వచ్చిన నీకు థాంక్యూ బ్యూటిఫుల్. నీతో కొత్త జీవితాన్ని మొదలుపెట్టేందుకు చాలా ఆశగా ఎదురుచూస్తున్నాను.” అంటూ తనకు కాబోయే భార్యతో దిగిన ఫొటోలను పంచుకున్నాడు కార్తిక్. అయితే ఈ రెండు ఫొటోల్లో ఆమె ఫేస్ మాత్రం చూపించలేదు.
కార్తిక్ పోస్టు చూసిన తన ఫ్రెండ్స్, సెలబ్రెటీలు విష్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. బిగ్‌బాస్ పింకీ, గెటప్ శీను, అదిరే అభి, జోర్దార్ సుజాత ఇలా ప్రస్తుత, మాజీ జబర్దస్త్ కమెడియన్లు కార్తిక్‌ను విష్ చేశారు. అయితే అమ్మాయిని ఎప్పుడూ చూపిస్తావంటూ ఫ్యాన్స్ సరదాగా కామెంట్లు పెట్టారు.
నిజానికి కెవ్వు కార్తిక్ కూడా ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చాడు. ఇద్దరు అక్కల పెళ్లితో అప్పుల పాలై ఎంతో పేదరికం చూసిన కార్తిక్.. మిమిక్రీ ఆర్టిస్టుగా ఎన్నో షోలు చేసి ఒక్కో మెట్టు ఎక్కుతూ చివరికి జబర్దస్త్‌తో బాగా ఫేమస్ అయ్యాడు.
ఆ తర్వాత నెమ్మదిగా హైదరాబాద్ వచ్చి.. ఇక్కడ కూడా ఎన్నో స్టేజ్ షోలు చేశాడు. జీ తెలుగులో ‘కామెడీ క్లబ్’ అనే షోతో కెరీర్ స్టార్ట్ చేసిన కార్తిక్.. నెమ్మదిగా ఎక్స్ ట్రా జబర్దస్త్‌లోకి వచ్చాడు. జబర్దస్త్ రెండు పార్ట్‌లుగా డివైడ్ అవడం.. కొత్త ఆర్టిస్ట్‌లను తీసుకోవడంతో ధనరాజ్ టీమ్ కార్తిక్‌కు ఛాన్స్ వచ్చింది.