Jabardasth : బుల్లితెరపై ప్రసారం అవుతున్న జబర్దస్త్ కామెడీ షో ప్రేక్షకుల్లో మంచి ఆదరణ పొందుతూ దూసుకుపోతుంది. ఈ షో ద్వారా ఎంతో మంది కళాకారులు వెలుగులోకి వచ్చారు. అలానే ఎక్స్ట్రా జబర్దస్త్ షో ద్వారా కూడా ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ స్టేజీపై నవ్వులు పూయించిన వారు ప్రస్తుతం వెండితెరపై వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు. ఇక మరికొందరు ఇప్పటికీ జబర్దస్త్ కామెడీ షోలోనే కొనసాగుతూ వస్తున్నారు. అయితే ప్రేక్షకులను నవ్వించే వారి జీవితంలో ఎంత విషాదం ఉంటుందో మనకు కొన్నిసార్లు స్టేజీపైనే వెల్లడించారు. వారిలో కమెడియన్ పంచ్ ప్రసాద్ కూడా ఒకరు.
ప్రసాద్ కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో గత కొంత కాలంగా బాధపడుతున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించనట్లు తెలుస్తుంది. ఈమధ్య కాలంలో ఆయన జబర్దస్త్ కామెడీ షోలో ఎక్కువగా కనిపించడం లేదు. దీనికి సంబంధించి మరో జబర్దస్త్ కమెడియన్ నూకరాజు… పంచ్ ప్రసాద్ పరిస్థితిని వీడియో రూపంలో ప్రేక్షకులకు వివరించారు. ఆ వీడియోలో… ప్రస్తుతం పంచ్ ప్రసాద్ నడవలేని స్థితిలో ఉండటం చూసి అభిమానులు, ప్రేక్షకులు షాక్‌కు గురవుతున్నారు.
ప్రసాద్ నడుముకు బ్యాక్ సపోర్ట్ బెల్టు వేసుకుని, తన భార్య సపోర్ట్‌తో మాత్రమే నిలబడుతున్నాడు. ఇక చేతిలో స్టాండ్ పట్టుకుని కదలాలని ఎంత ప్రయత్నించినా ప్రసాద్ నడవలేని స్థితికి చేరుకున్నాడు. ప్రస్తుతం ఆయన చికిత్స తీసుకుంటున్నాడని, డాక్టర్లు డయాలసిస్ చేస్తున్నారని పంచ్ ప్రసాద్ భార్య వాపోయారు. అయితే తన ఆరోగ్య పరిస్థితి గురించి ప్రేక్షకులకు తెలియజేయడం తనకు ఇష్టం లేదని ప్రసాద్ కోరాడు. తనదైన పంచులతో పంచ్ ప్రసాద్‌గా పేరుతెచ్చుకున్న ప్రసాద్ ను… ఈ విధంగా చూసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ సోషల్ మీడియా లో పోస్ట్ లు పెడుతున్నారు.
https://youtu.be/VRiSOokeuvA