Entertainment ప్రతి ఒక్కరికి ఎంతో మంచి లైఫ్ ఇచ్చింది అలాగే ఇందులోకి వచ్చిన వాళ్లంతా ఆర్థికంగా మంచి స్థాయిలో స్థిరపడ్డారు.. వారి జాబితాలోకే వస్తాడు.. జబర్దస్త్ కమెడియన్ రచ్చ రవి… దసరా పండుగ కానుకగా ఒక పెద్ద కారును కొని అందరికీ బిగ్ సర్ప్రైజ్ ఇచ్చాడు..
రచ్చ రవి.. బుల్లితెర కామెడీ షో అయిన జబర్దస్త్ ద్వారా పరిశ్రమలోకి అడుగు పెట్టాడు. ఇందులో తనదైన నటనతో ప్రేక్షకులను అలరిస్తూ వచ్చాడు.. నటనతో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన కంటూ ఓ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. చమ్మక్ చంద్ర టీమ్ లో మంచి యాక్టర్ గా నిలదొక్కుకున్నాడు.. ఓ స్కిట్ లో ‘తీసుకోలేదా 2 లక్షల కట్నం’ అనే డైలాగ్ తో పిచ్చ పాపులారిటీ సంపాదించాడు. జబర్దస్త్ క్రేజ్ తో పాటు తన నటనకు వెండితెర నుంచి కూడా అవకాశాలు భారీగా రావడంతో.. జబర్దస్త్ షోను మానేశాడు. దాంతో వరుస సినిమాలతో బిజీగా మారిపోయాడు. వరుణ్ తేజ్ నటించిన గద్దల కొండ గణేశ్ సినిమాలో నెగటీవ్ షేడ్ ఉన్న పాత్రలో చేసి.. ప్రేక్షకులను మెప్పించాడు. ఈ నేపథ్యంలోనే రచ్చ రవి దసరా పండుగ సందర్భంగా నెక్సా గ్రాండ్ వింటారా కారును కొనుగోలు చేశాడు.
ఈ ఆనందాన్ని తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా తెలియజేశాడు. ఇన్ని సంవత్సరాలు నాకు మద్దతుగా నిలుస్తున్న మీ అందరికి నా ధన్యవాదాలు అని రాసుకొచ్చాడు. ఇక ఈ కారు విలువ దాని ఫీచర్లను బట్టి దాదాపు రూ. 20 లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది… తమకు ఎంతో ఇష్టమైన కమెడియన్ ఎలా మంచి వృద్ధిలోకి రావడం అభిమానులకు కూడా ఎంతో ఆనందాన్ని ఇస్తుంది అంతేకాకుండా సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు…






















