Entertainment టాలీవుడ్ హీరో జగపతిబాబు గతంలో కోట్ల ఆస్తిని పోగొట్టుకున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా వందలకు పైగా సినిమాలో నటించినప్పటికీ రూపాయి కూడా లేకుండా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే తాజాగా ఇన్నాళ్ళకి ఆయన పోగొట్టుకున్న ఆస్తులు విలువ చెప్పుకొచ్చారు..
టాలీవుడ్ లో వందల సినిమాల్లో హీరోగా నటించిన జగపతిబాబు ఒకానొక సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆర్థికంగా నష్టపోయి చేతిలో చిల్లిగా లేకుండా మిగిలిపోయారు. అంతేకాకుండా చిన్న ఫ్లాట్లో అద్దెకు ఉంటూ పలు అవమానాలు ఎదుర్కొన్నారు. అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో విలన్గా తన కెరీర్ స్టార్ట్ చేసి మళ్లీ ఆర్థికంగా నిలదొక్కుకున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం పవర్ ఫుల్ క్యారెక్టర్ లో కనిపించి ప్రేక్షకుల్ని అలరిస్తున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన తన పోగొట్టుకున్న ఆస్తులు విలువ చెప్పుకొచ్చారు..
జగపతిబాబు తన ఆస్తులు గురించి మాట్లాడుతూ దాదాపు 1000 కోట్లకు పైగానే ఆస్తులు సంపాదించానని చెప్పుకొచ్చారు. అయితే వీటన్నిటిని కూడా పోగొట్టుకున్నానని తెలిపారు.. అంతేకాకుండా క్యాసినో వల్ల చాలా ఆస్తులు పోయాయని అయితే అది ఒకటి మాత్రమే కారణం కాదని అన్నారు. కేవలం తన అజాగ్రత్త, డబ్బుపై ప్రేమ లేకపోవడమే వీటన్నిటికీ కారణమని చెప్పుకొచ్చారు. అలాగే తాను ఇన్ని కోట్ల ఆస్తిని పోగొట్టుకోవడానికి కారణం వేరెవరో కాదని తన అజాగ్రత్త ఒక్కటే కారణమని తెలిపారు..