Entertainment బాలీవుడ్ హీరోయిన్ జాన్వి కపూర్ స్టార్ కిడ్ గానే సినిమాలోకి అడుగు పెట్టింది ఈ భామ ఇప్పటివరకు సౌత్ సినిమాల్లో నటించలేదు అయితే ఈమె ఎప్పుడెప్పుడు నటిస్తుందా అంటూ ఎప్పటికప్పుడు ప్రశ్నలు ఎదురవుతూనే ఉన్నాయి అయితే తాతగా తనకు ఇష్టమైన సౌత్ ఇండియా నటీనటుల కోసం చెప్పుకొచ్చింది ఈ భామ…
జాన్వి కపూర్ మరొకసారి సౌత్ ఇండియా స్టార్ల కోసం మాట్లాడింది ఈ సందర్భంగా తనకి ఇష్టమైన నటీనటులు దర్శకుల కోసం చెప్పుకొచ్చింది ఈ సందర్భంగా మహేష్ బాబు భార్య నమ్రత అంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపింది ఆమె వ్యక్తిత్వం కుందాతనం ఎంతగానో ఆకట్టుకుంటాయని చెప్పుకొచ్చింది అలాగే.. జూనియర్ ఎన్టీఆర్‌ను వెరీ టాలెంటెడ్, చార్మింగ్ యాక్టర్ అంటూ చెప్పకు వచ్చింది.. అలాగే మొదటిసారి ‘ఆర్ఆర్ఆర్’ చూసిన తర్వాత వెంటనే తన యాక్టింగ్ గురించి తెలుసుకునేందుకు ‘జనతా గ్యారేజ్’ చూసినట్లు వెల్లడించింది. ఇప్పటికే ఇండియాలో ఎంతోమంది తారకు అభిమానులని అందులో నేను కూడా ఒకరంటూ చెప్పకు వచ్చింది.. అలాగే ‘కాంతార’ మూవీ గురించి మాట్లాడుతూ.. రిషబ్ శెట్టికి ఫ్యాన్ అయిపోయానని, చివరి 30 నిమిషాల్లో తన పెర్ఫామెన్స్ చాలా ప్రత్యేకంగా ఉందని ప్రశంసించింది.
అల్లు అర్జున్ అంటే కూడా తనకు ఎంత ఇష్టమని వీరిద్దరితో కలిసి పనిచేయడానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు తెలిపింది.. అంతేకాదు ‘జనతా గ్యారేజ్’ డైరెక్టర్ కొరటాల శివ, ‘పుష్ప’ డైరెక్టర్ సుకుమార్ సర్‌తో కూడా వర్క్ చేయాలనుకుంటున్నట్లు ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది..