రాబోవు ఇరువై ఐదు సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల లో తెలుగు భాష ఎలా ఉండబోతుందో అన్న అంశం పై శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారి తో చర్చా కార్యక్రమాన్ని మలేషియా తెలుగు ఫౌండేషన్ (MTF ) ఆధ్వర్యంలో ఈరోజు మలేషియా కౌలాలంపూర్ లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇండియన్ కల్చరల్ సెంటర్, లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మలేషియా లో ని తెలుగువారు హాజరయ్యారు.
ఈ ఉత్సవాలకు ముఖ్య అతిధులుగా మెంబెర్ అఫ్ పార్లిమెంట్ సభ్యుడు గణపతిరావు గారు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇండియన్ కల్చరల్ సెంటర్ డైరెక్టర్ శ్రీమతి విజయలక్ష్మి సుందర రాజన్ గారు, అలాగే ప్రముఖ తెలుగు కవి మరియు సినీ గేయ రచయిత శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావుగారు తెలుగు భాషా ప్రాముఖ్యతను అలాగే రాబోవు తారాలలో తెలుగు భాషను ఏలా కాపాడుకోవాలో, మలేషియా లో ని పిల్లలు తెలుగు నేర్చుకోవడానికి ఇప్పటి తల్లి తండ్రులు ఎలాంటి జాగ్రతలు తీసుకోవాలో అలాగే వారు తెలుగు పై ఆసక్తి పెరగడానికి ఎలాంటి నీతి కథలను వారికీ భోదించాలో చాలా చక్కగా వివరించారు, అంతే కాకుండా మలేషియా లో తెలుగును కాపాడుతూ కృషి చేస్తున్న మలేషియా తెలుగు ఫౌండేషన్ ప్రసిడెంట్ దాతో కాంతా రావు గారిని అభినందించారు.
ఆ తరువాత మలేషియా తెలుగు ఫౌండేషన్ ప్రెసిడెంట్ దాతో కాంతారావు అక్కునాయుడు గారు ఎంపీ గణపతి రావు గారు శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారిని సన్మానించారు.
ఈ కార్యక్రమంలో తెలుగు అసోసియేషన్ అఫ్ మలేషియా, తెలుగు ఇంటెలెక్చవల్ అసోసియేషన్ అఫ్ మలేషియా, ఫైడా ఇంటర్నేషనల్ అఫ్ మలేషియా,పిరమిడ్ అండ్ మెడిటేషన్ సొసైటీ అఫ్ మలేషియా ,మలేషియా తెలంగాణ అసోసియేషన్,తెలుగు ఎక్సపెట్ అసోసియేషన్ , మలేషియా ఆంధ్ర అసోసియేషన్ ప్రముఖులు ఈ చర్చా కార్యక్రమములో పాల్గొన్నారు.
పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్