దివంగత రాకేష్ మాష్టర్ పిచ్చోడా.. తిక్కలోడా.. తైతక్కలోడా అనవసరం. నిజంగా తాను చనిపోయినా బతికున్న ఈ కొన్నాళ్లలో నా నుంచి ఎంత ఎక్కువ మందికి నాకు తెలిసిన కళను నేర్పిస్తే నేను అంతగా జీవించి ఉంటాను అనే గొప్ప ఆదర్శం కలిగిన కళాకారుడు.
ఇండస్ట్రీలో ఇలాంటి కళాకారులుండటం చాలా చాలా అరుదు. నేను కొందరు గురువులను చూశాను పేర్లు ఎందుకులే గానీ వాళ్లదెంతటి నీచ బుద్ధి అంటే.. నా మొత్తం పాతికేళ్ల సినీ మీడియా జర్నీలో ఓ ముగ్గురు నలుగుర్ని చూశా, నేను ఫిలిం నగర్ లో అడుగు పెట్టిన తొలినాళ్లలో నా తొలి గురువు ఒక నవలా రచయిత ఇరవై నాలుగ్గంటలూ.. మన దగ్గర ఉన్నది దోచి.. తన నవలల్లో అక్షరాలు నింపుకోవడమే నీకు రైటర్స్ అసోసియేషన్ కార్డు తీయిస్తా అన్నాడు తీసివ్వనే లేదు.
పోతే పోయే ఇంకో గురువు దగ్గర చేరా, చెన్నైలో ఉండేవాడీ గు. గురువు, నన్ను ఒక నాటిక రాయమని.. ఆ నాటిక నందికి సెలెక్ట్ అయితేనే నీకు నా దగ్గర శిష్యరికం ఇస్తానన్నాడు. ఎలాగోలా నా నాటిక నందికి సెలెక్ట్ కావడం ఆయన దగ్గర నేను పనిలోకి కుదరడం జరిగాయి. వీడిలో ఒక చలం ఉన్నాడని పొగిడిన ఈయన.. నా రచనా వారసుడివి నువ్వే అన్న ఈయన.. తర్వాత్తర్వాత… మేం ఇలా ఎవరి అండతోనూ ఎదగలేదు. ఎవరికి కావాలంటే వాళ్లు ఎదగడమే అంటూ మొండి చేయి చూపించాడు.
పోతే పోయింది.. ఫిలిం నగర్ వీధుల్లో గురువులకు కొదవా? అంటూ… మరో అతిపెద్ద గురువు దగ్గర చేరా… పేరులో సత్యం అని పెట్టుకున్న ఈయన.. అయితే ఏకంగా నా ఫీల్డే మార్చేశాడు. గత పదిహేనేళ్లుగా నేను సినిమాలను వదిలి మీడియాలోకొచ్చి పడ్డానంటే. సదరు సత్యానందుల వారే కారణం.
రీసెంట్ గా మరో దొంగనా గురువు దొరికాడు నాకు.. వీడి పేరులో ఉన్న సుకుమారం.. వ్యవహార శైలిలో ఉండదు.. మహా మాయగాడు మోసగాడు టక్కు టమార విద్యలన్నిటినీ పెట్టుకు పుట్టిన నీచాతి నీచుడు అధమాతి అధముడు… వీడు నాకు చేసిన మోసమెంతటిదంటే.. స్పాట్ …………… అరే జఫ్ఫా……. రాకేష్ మాష్టర్ బ్రాండెడ్ తిట్లు కొన్ని ఇక్కడ వేసుకోవాలన్నమాట.
నేను ఇతడ్ని కలిసింది ఒకట్రెండు సిట్టింగులే కావచ్చుగాక. అసలు ఫస్టు సిట్టింగులోనే నా నుంచి రెండు కథలు దొబ్బేశాడు. ఏదో నా పక్క సీటు మిత్రుడికి మిత్రుడు కదాని కుల్లం కుల్ల నా దగ్గరున్న మెయిన్ స్టోరీస్ చెబితే, వాటిని వీడెంత కొల్లగొట్టాడంటే………..అంత!
(అవి మరేవో కావు- ఒకటి పుష్ప, రెండు 18 పేజెస్….)
ఇలాంటి కథనాలు నేను ఎన్ని పెట్టినా.. అలాంటి పని నేను చేయలేదని చెప్పమనండి చూద్దాం… నెవ్వర్… అలా ఎప్పటికీ చెప్పలేడు.. ఒక దొంగకు తానెంతటి దగాకోరో తెలుసు కదా? మాట ఎలా పెగులుతుంది? అందుకంటూ ఒక నిజాయితీ ఉండాలిగా!!!
తెర బయట మాట నాకు తెలీదు కానీ తెర మీద మాత్రం ఒక అమ్మకు అబ్బకు పుట్టలేదనుకుంటా, నిన్న ఒక మిత్రుడు అడిగాడు.. నీకు ఏమీ ఇవ్వలేదా? అని… జా. త. ఎ. అని కసిదీరా తిట్టుకుని బాధ పడ్డా…
ఇక్కడ డబ్బులది ప్రధాన పాత్ర కాదు కానీ.. కొంత గుర్తింపు అనేది కోటాను కోట్ల రూపాయల మేర.. విలువ చేస్తుంది
అది ఇతరులకు దక్కకుండా… వారి నుంచి ఎంత గుంజుకోవాలో.. అంత.. ఆ వ్యభిచారులే నయం.. కొంత పడక సుఖాన్ని అందించి డబ్బులడుగుతారు.. వీడు మన మేధస్సు మొత్తం చౌర్యం చేసి.. చిల్లి ఖానీ కాదు కదా..
కనీస గుర్తింపును ఇవ్వక పోగా.. నన్ను నా నెంబర్ ని బ్లాక్ లో పెట్టిన బోగ్గాడు.
ఇలాంటి లఫూట్- లఫంగి- లుచ్చా నాకొడుకుల మధ్య రాకేష్ మాస్టర్ నాకు మహోన్నతంగా కనిపిస్తున్నాడు..
రియల్లీ హ్యాట్సాఫ్ మాష్టర్. మీ మాట మకిలిగా ఉంటుందేమోగానీ మీ మనసు మాత్రం వెన్న అందుకు ఒక శేఖర్ మాష్టర్- జానీ మాష్టర్- సత్య మాష్టర్ లాంటి వాళ్లతో పాటు ఇంకా ఎందరో కళాకారులను మీరిప్పటి వరకూ తయారు చేసి పది కాలాల పాటు ఇంకా బతికే ఉన్నారు మీరు.
మీరు వెళ్లిపోయారేమోగానీ మీరు నేర్పిన కళ రూపంలో మీరింకా బతికే ఉన్నారు.
గ్రేట్ మాష్టర్ మీరు ఎవర్ గ్రేట్!
అండర్ లైన్
————-
అరే జఫ్ఫాస్… మీరు వెళ్లాక మీ ఆస్తులు మీ పిల్లలు ఇతర కుటుంబ సభ్యలకు వెళ్తాయేమో కానీ.. మీ కళను మోసేది మాత్రం మాలాంటి శిష్య పరమాణువులే గుర్తుంచుకుని అఘోరించండి. మీ చరిత్రను మీ చేజేతులా చెడగొట్టుకు దొబ్బకండి…
– ఒక శిష్య బాధితుడి ఆవేదనకు అక్షర రూపం.