Entertainment నందమూరి బాలకృష్ణ టాక్ షో అన్ స్టాపబుల్ సీజన్ 2 తొందరలోనే ప్రారంభం కానుంది అయితే ఈ సీజన్ లో మొదటి ఎపిసోడ్ స్ట్రీమింగ్ ఎప్పుడు అనేది అధికార ప్రకటన తొందర్లోనే రాబోతుంది.. అయితే ఈ మొదటి ఎపిసోడ్ కోసం ఇప్పుడు చర్చ నడుస్తోంది..
బాలకృష్ణ టాక్ షో అమ్ స్టాపబుల్ సీజన్ వన్ లో మొదటి ఎపిసోడ్ లో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్న సంగతి తెలిసిందే అయితే సీజన్ టు మొదటి ఎపిసోడ్లో జూనియర్ ఎన్టీఆర్ బాబాయ్ తో కలిసి సందడి చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే ఇలా జరిగితే ఆనందించాల్సిన విషయం అయినప్పటికీ.. ఈ విషయంపై ఇంకా అధికార ప్రకటన రావాల్సి ఉంది..
బాలకృష్ణ అన్ స్టాపబుల్ కి జూనియర్ ఎన్టీఆర్ రావడం పై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి బాబాయ్ అబ్బాయి ఇద్దరినీ ఒకే షోలో చూడటం నందమూరి అభిమానులకు కనువిందు కలిగించే విషయమే.. అయితే వీరిద్దరి మధ్య ముందు నుంచి సరైన సఖ్యత లేదు ఇంకా చెప్పాలి అంటే మీడియం ముందుకు వచ్చినప్పుడు ఒకరినొకరు పలకరించుకోవడమే తక్కువ ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు బాలకృష్ణ షో కి జూనియర్ ఎన్టీఆర్ రావడం కష్టమే అంటూ వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఏం జరుగుతుందనేది చూడాల్సి ఉంది.. మంగళవారం విజయవాడలో అన్‌స్టాపబుల్ సీజన్-2 లాంచ్ ఈవెంట్ చాలా గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేదికపై అన్‌స్టాపబుల్ సీజన్-2 టీజర్‌ను బాలకృష్ణ లాంచ్ చేశారు. ఈ టీజర్లో బాలయ్య ఎంతో పవర్‌ఫుల్‌గా కనిపించారు. అయితే ఈ ఈవెంట్‌కు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.