Junior Ntr RRR చిత్రంతో సక్సెస్ అందుకున్న రామ్ చరణ్ తదుపరి చిత్రంలో బిజీ అయ్యారు. అయితే రామ్ చరణ్ ఇప్పటికే తన తర్వాత చిత్రం కోసం అప్డేట్ ఇవ్వగా ఎన్టీఆర్ నుంచి అలాంటి అప్డేట్ రాలేదు. అయితే ఈ విషయం ఎన్టీఆర్ అభిమానులను నిరాశపర్చినదనే చెప్పాలి. అయితే ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో నటించబోతున్న ఎన్టీఆర్ 30 చిత్రం గురించి ఒక బిగ్ అప్డేట్ హాల్ చల్ చేస్తుంది. ఈ చిత్రం షూటింగ్ తొందరలోనే మొదలవుతుంది అని ప్రచారం ఊపదుకుంది.
అయితే ఈ చిత్రం నవంబర్ లో షూటింగ్ మొదలుపెట్టుకోనుందని జరుగుతున్న ప్రచారంలో నిజం అనేది ఎంత ఉందో తెలియకపోయినప్పటికీ ఇది ఎన్టీఆర్ అభిమానులకు ఒక పెద్ద శుభవార్తనే చెప్పాలి.
ఈ సినిమాలో ఇప్పటివరకు కథానాయయిక ఎవరు అనేది నిర్ణయించినప్పటికీ కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ను ఇందులో హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నారని ప్రచారం సాగినా అయితే ఇందులో నిజం లేదని అంటున్నాయి సినీ వర్గాలు. ఎన్టీఆర్ 30 చిత్రం మాఫియా బ్యాగ్రౌండ్ తో రాబోతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ చిత్రాన్ని యాక్షన్ ఎంటర్టైనర్ గా కూడా తెరకెక్కించాలని కొరటాల శివ ప్రయత్నిస్తున్నారట.