Viral Video సాధారణంగా జిమ్‌లో వర్కౌట్లు చేస్తున్నప్పుడు కొన్ని కొన్ని సార్లు తప్పిదాలు జరుగుతుంటాయి కీళ్లు పట్టేయడం, కింద పడిపోతూ ఉండటం జరుగుతూ ఉంటాయి. అయితే ఇవన్నీ కొన్నిసార్లు నవ్వుకోడానికి బానే ఉన్నా మరి కొన్నిసార్లు మాత్రం ప్రాణాలు మీదకు తెస్తుంటాయి..
కొత్తలో జిమ్ లో జాయిన్ అయిన వాళ్లు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.. ఎన్నాళ్ల నుంచి చేస్తున్న మరికొందరు అవే తప్పిదాలు చేస్తుంటారు ఇలాంటి ఓ సంఘటన అమెరికాలో చోటు చేసుకుంది.. చెందిన క్రిస్టిన్ ఫాల్డ్స్ అనే మహిళ తెల్లవారు జామున 3గంటలకు ఒంటరిగా ఇంట్లోని జిమ్‌లో ఇన్వర్షన్ టేబుల్ అనే ఎక్విప్‌మెంట్‌పై వర్కౌట్స్ చేస్తోంది. వెన్నెముక, నడుమునొప్పి తగ్గేందుకు దీనిని ఉపయోగించి ఎక్సర్సైజ్ చేస్తుంటారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా అప్పుడే ఆమెకు చేదు అనుభవం ఎదురైంది. ఉన్నట్టుండి మహిళ ఇన్వర్షన్ టేబుల్‌పై తలకిందులైంది. కాళ్లు అందులో ఇరుక్కుపోవడంతో ఎంత ప్రయత్నించినా తిరిగి మామూలు స్థితికి రాలేకపోయింది.
సాయం కోసం జిమ్‌లో జాసన్ అనే మరో వ్యక్తిని పిలిచినా భారీ సౌండ్‌తో మ్యూజిక్ ప్లే అవుతుండటం వల్ల అతనికి వినిపించలేదు. పైకి లేవలేక, బయటకు రాలేక అలాగే ఇబ్బంది పడింది. కాసేపు ఏం చేయాలో తోచలేదు. వెంటనే ఆమెకు ఓ ఉపాయం తట్టింది. తన చేతికి ఉన్న స్మార్ట్ వాచ్ ఉపయోగించి ఎమర్జెన్సీ నెంబర్ 911కు కాల్ చేసింది. తన పరిస్థితిని వివరించి, సాయం కావాలని కోరింది. స్పందించిన పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని తలకిందులుగా ఉన్న ఆమెను రక్షించారు.
'This is so embarrassing' — A woman went viral after getting stuck upside down on an exercise machine and calling 911 for help 😅 pic.twitter.com/8nod8P6oQl
— NowThis Impact (@nowthisimpact) September 5, 2022
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను స్వయంగా ఆమెనే టిక్‌టాక్‌లో పోస్టు చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.