ఈ సందర్భంగా ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కే. ఏ. పాల్ మాట్లాడుతూ… త్యాగాలు చేసిన తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి మేలు చేయట్లేదు అని వాళ్ళ బాధలు వర్ణనాతీతమని ఆయన అన్నారు. ఈ కేసీఆర్ తెలంగాణ అమరవీరులను ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదని ఆయన విమర్శించారు. తెలంగాణ అమరవీరులు అంతా ఒక్కటి అవుతున్నారని, తమకు జరుగుతున్న అన్యాయం ను గుర్తిస్తున్నారని, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరిగేంత వరకు, రాష్ట్రంలోని ప్రతి జిల్లా ప్రతి మండలం, అన్ని గ్రామాలకు నేను తిరిగి చైతన్యవంతం చేస్తానని చెప్పారు.
ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కే ఏ పాల్ తెలంగాణ అమర వీరుల కుటుంబాలకు సత్వర న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని, అందుకే తాను ప్రజాశాంతి పార్టీ లో చేరానని ఆయన అన్నారు. ప్రతి ప్రభుత్వ ఆఫీసులో కాసోజు శ్రీకాంతాచారి ఫోటో పెట్టాలని ఆయన కోరారు. తెలంగాణ అమరవీరులకు న్యాయం జరిగేంత వరకు నేను పోరాటం చేస్తానని అన్నారు. తెలంగాణ అమరవీరుల త్యాగాలను ఈ కేసీఆర్ వాడుకొని, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు అన్యాయం చేస్తున్నాడని, తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వారికి మేలు చేస్తున్నారని అన్నారు.
అందుకే కాసోజు శ్రీకాంతాచారి తండ్రి కాసోజు వెంకటచారీ గారికి, తొలి ఎమ్మెల్యే సీటు ప్రకటించామని తెలిపారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాల అందరికీ ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉచిత గృహ వసతి సత్వరమే కల్పిస్తామని అన్నారు. తెలంగాణ అమరవీరుల త్యాగ ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది అని, తెలంగాణ మలిదశ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి తండ్రి కాసోజు వెంకటాచారి అన్నారు.