కళామందిర్ ఫౌండేషన్ 15వ వార్షికోత్సవాలను ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా హైదరాబాదులో అట్టహాసంగా నిర్వహించారు. ఈ వార్షికోత్సవ వేడుక రాజకీయవేత్తలు, సినీ ప్రముఖులు, వ్యాపార నిపుణులు, సామాజిక సేవకర్తలు, కళామందిర్ ఫౌండేషన్ నిర్వాకులతో పాటు, కళామందిర్ షాపింగ్ మాల్ ఉద్యోగస్తులతో ఆధ్యాంతం కన్నుల పండుగగా అత్యంత అద్భుతంగా జరిగింది.
ఈ బృహత్ కార్యక్రమానికి ప్రముఖ నటి యాంకర్ ఝాన్సీ వ్యక్తగా వ్యవహరించారు. ఈమెతో పాటు తెలుగు పరిశ్రమ మాటల, పాటల రచయిత సిరా శ్రీ కూడా యాంకర్ గా వ్యవహరించారు. ఫౌండేషన్ను స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలను దిగ్విజయంగా నిర్వహిస్తున్న సందర్భంగా ఈ సంవత్సరం కళామందిర్ ఫౌండేషన్ సరికొత్త సేవా కార్యక్రమాలను ఆవిష్కరించింది. 2009లో చిన్న విత్తనంగా మొదలై వటవృక్షంలా ఎదిగి 15 సంవత్సరాలుగా నిర్విరామంగా సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ విశేష ప్రజాదరణను పొందింది.
సే నో టు డ్రగ్ మొదలు సమాజం పట్ల ఉన్న ప్రేమతో అనేక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా పేద విద్యార్థులకు విద్యా, ఆర్థికదానం అందించడమే కాకుండా.. సమాజం పట్ల సేవా దృక్పథంతో నిర్విరామంగా సేవ చేస్తున్నవారిలో ఈ సంవత్సరం ఐదుగురు మహోన్నత వ్యక్తులను గుర్తించి వారికి సేవా రత్న పురస్కారంతో పాటు నగదు బహుమతిని అందించింది. ఈ కార్యక్రమం ద్వారా కళా మందిర్ ఫౌండేషన్ వారిని ప్రోత్సహించడమే కాకుండా వారి పట్ల తమ కృతజ్ఞతను చూపించింది.
ఈ కార్యక్రమంలో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. అందులో ఢీ డాన్స్ షో ఫేమ్ మణికంఠ మాస్టర్ నేతృత్వంలో వికలాంగులతో డ్యాన్స్ షో నిర్వహించారు. అలాగే దివ్యాంగులైన చిన్నారులతో కేఎల్ఎం బ్రాండ్ బట్టలను ధరింపజేసి ఫ్యాషన్ షో, ర్యాంప్ వాక్ లను నిర్వహించారు. డాన్స్ ముగిసిన తరువాత SSKL చైర్ పర్సన్ విక్రమ్ మణికంఠ గ్రూప్ లో డాన్స్ చేసిన వికలాంగులకు కళామందిర్ ఫౌండేషన్ తరుపున రూ. 1 లక్ష బహుమతిగా అందించారు.
అలాగే చెరిష్ ఫౌండేషన్, సరితాకృష్ణ ఫౌండేషన్, సేవ్ ది చైల్డ్ ఫౌండేషన్లకు ఒక్కొక్కరికి రూ.1 లక్ష చెక్ లను అందించారు. ఈ చెక్ పంపిణీలో సినిమా డైరెక్టర్ అనిల్ రావి పుడి, మను చరిత్ర హీరో శివ కందుకూరి, రాజేష్ అన్నం, కళామందిర్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ భరద్వాజ్ పాల్గొన్నారు.
కళామందిర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భాగంగా ప్రతి సంవత్సరం లానే ఈ సంవత్సరం కూడా చేనేత రంగాన్ని ప్రోత్సహించడానికి, నేతన్నలకు ఆపన్న హస్తం ఇచ్చి ఆదుకునేందుకు 21 మందిని ఎంచుకొని, ప్రతీ ఒక్కరికి 20 వేల చొప్పున రూ. 4 లక్షల 20వేల చెక్ ను ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, నిజామాబాద్ ఎమ్మెల్యే బీగాల గణేష్ గుప్తా అందించారు.
ఏది ఆశించకుండా సమాజా అభివృద్ధి కోసం నిస్వార్ధంగా సేవ చేస్తున్న రియల్ హీరోస్ ని గుర్తించిన కళామందిర్ ఫౌండేషన్, వారిని ప్రోత్సహించడానికి చేపట్టిన మరో బృహత్ కార్యక్రమమే సేవారత్న అవార్డ్స్. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం 5 మందిని ఎంపిక చేసి వారికి ఒక్కొక్కరికి రూ. 50 వేల నగదు బహుమతితో పాటు ట్రోఫీని అందజేశారు.
వారిలో 1. టచ్ అనాథ శరణాలయం స్థాపించిన ఏ. వినయ్, 2. కస్తూర్భాగాంధీ బాలికల సంక్షేమ సంస్థ నడిపిస్తున్న టీ. రుక్మిణీ, 3. ఆంద్రప్రదేశ్ లో బెండపూడి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఇంగ్లీష్ నేర్పించి అనర్గళంగా మాట్లాడయించిన ఉపాధ్యాయుడు జీ. వీర ప్రసాద్, 4. హంగర్ హ్యాస్ నో రిలిజియన్ ఫౌండర్ అజార్ మక్సుసి 5. గోశాలలు నిర్వహిస్తూ అనేక గోవులను రక్షిస్తున్న కె. శివ కుమార్ లకు బహుమతి అందించారు.
ఈ కార్యాక్రంలో ఐపీఎస్ ఆఫీసర్ జె ఎస్ రంజాన్, యాక్టర్ సత్యదేవ్, హీరోయిన్ మీనాక్షి చౌదరి, బీగాల మహేష్, తెలుగు సినిమా బేబీ చిత్ర యూనిట్ హీరో ఆనంద్ దేవరకొండ, హీరయిన్ వైష్ణవి, ప్రొడ్యూసర్ ఎస్ కే ఎన్, డైరెక్టర్ రాజేష్ , హైపర్ ఆది తదితరులు పాల్గొన్నారు.
అలాగే కళామందిర్ షాపింగ్ మాల్ లో పనిచేస్తున్న అనేక మందిని ఆర్థికంగా ఆదుకొనడమే కాకుండా వారి పిల్లల చదువులకు కూడా కళామందిర్ ఫౌండేషన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్ లను కూడా అందిస్తుంది ఈ కార్యక్రమంలో భాగంగా కళామందిర్ ఫౌండేషన్ అందించే ఎంవి మెరిట్ స్కాలర్షిప్ లకు ఎంపికైన విద్యార్థులను సత్కరించారు ఏ కార్యక్రమంలో మాజీ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ జెడి లక్ష్మీనారాయణ, మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఎస్ఎన్ రంజన్, ఎమ్మెల్యే బీజాల గణేష్ పాల్గొన్నారు.
ప్రపంచంలో ఏ సంస్థ చేయని మహాద్భుతమైన కార్యక్రమానికి కళామందిర్ ఫౌండేషన్ శ్రీకారం చుట్టింది. ప్రభుత్వాలే చేయలేని గొప్ప గొప్ప కార్యక్రమాలను విజయప్రదంగా ముందుకు సాగిస్తోంది. ఈ కార్యక్రమాలలో భాగంగా తమ కంపెనీలో పనిచేస్తున్న అనేకమంది ఉద్యోగస్తులకు సొంత ఇంటి కలను నిజం చేస్తూ.. హౌసింగ్ స్కీమును ప్రవేశపెట్టి లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి పక్కా ఇళ్లను కట్టించింది.
ఈ కార్యక్రమంలో లబ్ధిదారులకు వారి ఇంటికి సంబంధించిన పత్రాలను అందించింది. అంతేకాకుండా తమ సంస్థలో వచ్చే ఆదాయంలో 4.67 శాతాన్ని ఉద్యోగస్తుల సంక్షేమానికి వినియోగిస్తున్నట్లు SSKL ఎంప్లాయ్ వెల్ఫేర్ ఫండ్ ను ఆవిష్కరించారు. ఉద్యోగస్తులను వ్యాపారంలో భాగస్వామ్యం చేసుకున్నారు. అనంతరం ఎస్ ఎస్ కే ఎల్ చైర్మన్ ప్రసాద్ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు.