Entertainment తాజాగా కంగనా రనౌత్ బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ పై అసహనాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు..
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ మరొకసారి వార్తల్లో నిలిచారు. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ పై విమర్శలు గుప్పించి తన అసహనాన్ని వ్యక్తం చేశారు.. మూడు జాతీయ అవార్డులు గెలుచుకున్న నన్ను అమీర్ ఖాన్ మర్చిపోవడం విడ్డరంగా ఉందంటూ చెప్పుకొచ్చారు..
కంగనా అమీర్ ఖాన్ ను ఎందుకు టార్గెట్ చేశారు అంటే.. ‘లాల్ సింగ్ చడ్డా’ సినిమా పరాజయం తర్వాత మీడియాకు కాస్త దూరంగా ఉంటున్నారు ఆమిర్ ఖాన్. తాజాగా ఆయన.. రచయిత శోభా డే రచించిన ఓ పుస్తకం విడుదల కార్యక్రమంలో పాల్గొని మీడియాతో కాసేపు సరదాగా ముచ్చటించారు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న అమీర్ అక్కడే ఉన్న విలేఖరి.. “ఒకవేళ శోభా డే మీద బయోపిక్ తీస్తే ఆమె పాత్రలో ఎవరు నటిస్తే బాగుంటుంది” అని ప్రశ్నించాడు. దీనికి గానూ అమీర్ “ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణె, అలియాభట్.. వీళ్లు గొప్ప నటీమణులు. నాకు ఈ ముగ్గురే గుర్తుకు వస్తున్నారు. వేరే ఎవరి పేరు తట్టడం లేదు” అని ఆమిర్ బదులిచ్చారు.
అయితే వెంటనే పక్కనే ఉన్న శోభా డే కంగన పేరు చెప్పగా.. “అవును. కంగన కూడా మంచి నటీమణి” అని ఆయన మెచ్చుకున్నారు. అయితే దీనికి సంబంధించిన ఒక వీడియో తాజాగా బయటకు వచ్చింది ఇది చూసి కంగనా రన్ అవుతుంది సోషల్ మీడియాలో తనదైన శైలిలో ఫైర్ అయ్యారు.. “అయ్యో పాపం ఆమిర్.. నటిగా మూడు జాతీయ అవార్డులు అందుకున్న నా పేరు చెప్పకుండా ఉండటానికి ఎంతో శ్రమించారు. కాకపోతే అది సాధ్యం కాలేదు. నా పేరును ప్రస్తావించినందుకు థ్యాంక్యూ శోభా. మా ఇద్దరి రాజకీయ భావాలు వేరైనప్పటికీ, నా కళ, శ్రమను ప్రశంసించడంలో ఆమె ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఆమె గొప్పతనానికి ఇది అద్దం పడుతుంది” అని ట్వీట్ చేశారు..