Gossip News: చిత్ర పరిశ్రమ ఒక రంగుల ప్రపంచంగా కూడా చెప్పుకోవచ్చు ఆ ప్రపంచంలో తారలు తమకు నచ్చిన వారితో జీవిస్తూ వైరల్ అవుతూ ఉంటారు. కొందరు వివాహం చేసుకొని తమ జీవితాలను సంతోషంగా గడుపుతారు. మరికొందరు వివాహం వరకు వచ్చి విడిపోతుంటారు. సినీ పరిశ్రమలు ఉండేవారి వ్యక్తిగత జీవితంలో విష అనుభవాలనే చవిచూస్తూ ఉంటారు. అలాంటి వారిలో కన్నడ స్టార్ చిరంజీవి సర్జా సతీమణి నటి మేఘనా రాజ్ చెప్పుకోవాలి.నటి మేఘనా రాజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్న అంటూ గాసిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
కన్నడ స్టార్ చిరంజీవి సర్జా నటి మేఘనా రాజ్ పదేళ్లు ప్రేమలో మునిగి తేలాక 2018 మే 2న వివాహం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. వివాహం చేసుకున్న కొన్ని నెలల తర్వాత స్టార్ చిరంజీవి సర్జా గుండెపోటుతో మరణించారు. అయితే అప్పటికే గర్భవతి అయ్యారు మేఘనా రాజ్.
తన కొడుకులోనే భర్తను చూసుకుంటూ కాలం సాగిస్తుంది. అయితే ఆమె త్వరలో రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు రూమర్లు వినిపించడంతో ఈ రూమర్‌పై స్పందించారు మేఘనా రాజ్. ఇప్పటి కూడా కొందరు నన్ను మళ్లీ పెళ్లి చేసుకోమని సలహా ఇస్తున్నారు. మరికొందరేమో నా కొడుకును బాగా చూసుకుంటూ అతడితోనే ఉండమని సూచిస్తున్నారు. మరి నేను ఎవరి మాట వినాలి? అంటూ చెప్పుకొచ్చారు. మన గురించి ప్రపంచ ఏమనుకుంటుందో అలాంటి విషయాలు పట్టించుకోకూడదు అని మనసుకు ఏదనిపిస్తే అదే చేయమని చెప్పేవాడు చెప్పుకొచ్చారు. నా భర్త పోయిన తర్వాత నేను ఇప్పుడు పెళ్లి గురించి ఆలోచన చేయలేదు అని మేఘన తెలిపారు.