అక్కినేని నాగేశ్వరరావు, ఎన్ టి రామారావు తెలుగు చలన చిత్ర పరిశ్రమకు లో అగ్ర హీరో లుగా వెలుగుతున్న సమయం లోనే వారి ధీటుగా ప్రముఖ హీరో గా కాంతారావు నిలబడ్డారు అన్నారు ప్రముఖ నిర్మాత, దర్శకులు తమ్మా రెడ్డి భరద్వాజ.
శనివారం, జూబ్లీ హిల్స్ లోని ఫిల్మ్ ఛాంబర్ లో ప్రముఖ సంస్థ ఆకృతి ఆధ్వర్యంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.. డిసెంబర్ నెలలో రవీంద్రభారతి వేదిక గా కాంతారావు శత జయంతి పురస్కార సభను నిర్వహిస్తున్నట్టు ఆయన వివరించారు.. ప్రసిద్ధ హీరో సుమన్ ఈ అవార్డు అందుకుంటారు అన్నారు. హీరో గా నిలదొక్కు కున్నా తదనంతరం ఆయన సహాయ పాత్రల్లో చేయక తప్పలేదు అన్నారు..
విశిష్ట అతిథిగా పాల్గొన్న pramukha దర్శకులు రేలంగి నరసింహారావు మాట్లాడుతూ… కాంతా రావు కత్తి యుద్దాలు తనకు చాలా ఇష్టమని చెబుతూ సుందరీ సుబ్బారావు లో ఆయన కు మంచి వేషం ఇచ్చానని గుర్తు చేసుకున్నారు. మరో దర్శకుడు పి. సి. ఆదిత్య మాట్లాడు తూ, కాంతా రావు బయో పిక్ చేస్తున్నట్టు.. ఈ విషయమై వారి స్వ గ్రా మం కోదాడ మండలం గుది బండ వెళ్లి వచ్చినట్టు వవరించారు. ఆకృతి సుధాకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్య క్రమం లో ఫిక్కీ సి. ఎం. డీ అచ్యుత జగదీష్ చంద్ర, కాంతా రావు కుమారుడు నటుడు రాజా తో పాటు పలువురు విలేకరులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు..
https://youtu.be/-tZB0d_XML4