Entertainment రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన కాంతారా చిత్రం ఎంత విజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా విజయం సాధించింది అయితే ఇప్పుడు ఈ సినిమా ఆస్కార్ బరిలో నిలబడి ఉందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి..
కాంతార చిత్రం.. శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చింది ఈ సినిమా మొదటగా కన్నడలో విడుదలయ్యి తర్వాత పాన్ ఇండియా స్థాయిలో విజయాన్ని సాధించింది కేవలం 16 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా 400 కోట్లకు పైగా సాధించింది ముఖ్యంగా ఈ సినిమా విజయంతో రిషబ్ శెట్టికి ఎక్కడలేని క్రేజ్ వచ్చేసింది అలాగే ఈ సినిమాకు కేవలం నాలుగు కోట్లు మాత్రమే రెమ్యూనరేషన్ తీసుకున్న ఈయనకు ప్రస్తుతం 50 కోట్ల వరకు రెమ్యూనరేషన్ పెంచేసినట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.. ఈయనకు అన్ని చిత్ర పరిశ్రమల నుంచి ఇప్పటికే ఆఫర్లు క్యూ పెడుతున్నట్టు తెలుస్తోంది అలాగే టాలీవుడ్ నుంచి కూడా గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఓ చిత్రాన్ని నటించటానికి ఈయనకు సంప్రదించారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకు వేసి కాంతారా చిత్రం మరో విజయాన్ని అందుకోబోతుందని తెలుస్తోంది..
అయితే ఇప్పుడు ఈ చిత్రం ఆస్కార్బరిలో నిలవనున్నట్టు తెలుస్తుంది.. త్వరలోనే ఆస్కార్ నామినేషన్ జరగబోతున్నట్టు ఇందులోనే కాంతారా చిత్రానికి నామినేషన్ వెళ్లనుందని సమాచారం.. ఇదే జరిగితే రిషబ్ శెట్టి స్థాయి ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి అలాగే ఈయన ఇంత కష్టపడినందుకు తగిన గౌరవం కూడా దక్కుతుంది అని కన్నడా నాట వార్తలు వినిపిస్తున్నాయి..