Entertainment సెలబ్రిటీలు అంటేనే తమ ప్రాపర్టీ అన్నట్టు ఫీల్ అయిపోతుంటారు అభిమానులు అందులోను హీరోయిన్స్ అంటే ఏం చేసినా పర్వాలేదు ఎలా ప్రవర్తించినా పర్వాలేదు అన్నట్టు మారిపోతుంది..వాళ్లను తమ సొంత మనుషుల్లా ట్రేట్ చేస్తుంటారు. ఈ రోజుల్లో అభిమానుల తీరు షాక్ కే గురి చేస్తుంది.. ఇలాంటి ఓ షాకింగ్ సంఘటనే కరీనాకపూర్ కు ఎదురయింది..
పబ్లిక్ లో హీరోయిన్లు కనిపిస్తే అభిమానులకు పండగే వాళ్లను అస్సలు నడవనివ్వరు సెల్ఫీల కోసమో.. ఆటోగ్రాఫ్‌ల కోసం వెంట పడుతూనే ఉంటారు. వాళ్లకు ఏమాత్రం ప్రైవసీ లేకుండా ప్రవర్తిస్తుంటారు.. అయితే ఇంకొందరు అభిమానులు శృతిమించి ప్రవర్తిస్తుంటారు ఇలాంటి ఓ సంఘటనే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనాకపూర్ కు ఎదురయింది. సెల్ఫీ కోసం వచ్చిన ఒక అభిమాని హద్దులు దాటి ప్రవర్తించాడు. ఆమె పక్కన నిల్చోని.. భుజంపై హీరో లెవెల్ లో చేయి వేసుకొని నిలబడ్డాడు. అయితే ఈ విషయంపై కరీనా ఏమీ అనకుండా అలానే నిల్చోగా.. ఆమె బాడీగార్డ్ వచ్చి వెంటనే అభిమానిని వెనక్కి నెట్టాడు.. ఈ సంఘటనకు కరీనా కాసేపు షాక్‌కు గురైన ఏమీ అనకుండా అలానే సహనంగా ఉండిపోయింది ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. చూసినవాళ్లంతా ఏమీ అనకుండా ఉండిపోయిన కరీనాను ఎంతగానో మెచ్చుకుంటున్నారు. ఈమె తమ అభిమానులకు ఎంతో రెస్పెక్ట్ ఇస్తుందని.. అలాంటి ఎంత అపురూపంగా చూసుకోవాలంటూ కామెంట్లు పెడుతున్నారు.. అంతేకాకుండా కరీనాకపూర్ కాబట్టి అంత సహనంతో ముందుకు వెళ్లిపోయింది.. ఇంకో హీరోయిన్ ఎవరైనా అయి ఉంటే చెంప సెల్లు మనిపించేది అని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు..