Entertainment ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులంతా ఎప్పుడు అని ఎదురు చూస్తున్నా అవతార్తులు చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదలైన ఈ సినిమా మంచి టాకింగ్ సంపాదించుకుంది సినిమాలో హీరోయిన్ చేసిన సాహసం ప్రస్తుతం వైరల్ గా మారింది..
ఈ చిత్రం కోసం ప్రమోషన్స్లో భాగంగా హాలీవుడ్ నటి కేట్ విన్స్లెట్ ఈ చిత్రం షూటింగ్లో తాను ఎదుర్కొన్న ఓ అనుభవాన్ని తెలిపింది. ఓ సీన్ కోసం తాను దాదాపు 7 నిమిషాల 15 సెకన్ల పాటు ఊపిరి తీసుకోలేదని పేర్కొంది. అయితే ఈ విషయం విన్న వారంతా షాక్కు గురయ్యారు.. ఆమె హాలీవుడ్ స్టార్ టామ్ క్రూజ్ రికార్డ్ బ్రేక్ చేసినట్టైంది అంటున్నారు.. కాగా ఆయన మిషన్ ఇంపాజిబుల్.. రోగ్ నేషన్ సెట్లో టామ్ దాదాపు ఆరు నిమిషాల పాటు ఊపిరి తీసుకోకుండా ఉన్నారు.
అయితే షూటింగ్ లో నీటి అడుగున షూటింగ్ చేస్తున్నప్పుడు ఎంతో ఒత్తిడి భరించానని.. ఆ సమయంలో తాను చనిపోయానని అనుకుని అరిచానని.. ఇందుకు సంబంధించిన వీడియో తన వద్ద ఉన్నట్లు చెప్పుకొచ్చింది విన్స్లెట్. దాదాపు 7 నిమిషాల పాటు ఊపిరి తీసుకోకుండా ఉన్నానని ఈ విషయాన్ని తనకు తానే నమ్మలేకపోయానని చెప్పింది అయితే అవతార్ టూలో రుణాలు పాత్రలో కనిపించిన ఈమె 1997లో వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం టైటానిక్ లో కూడా హీరోయిన్గా నటించింది ఈ చిత్రం కూడా జేమ్స్ కేవలం దర్శకత్వంలోనే వచ్చింది