Entertainment బాలీవుడ్ స్టార్ కపుల్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ వివాహ బంధంలోకి అడుగు పెట్టి ఈరోజుకు ఏడాది పూర్తయింది.. ఈ సంవత్సర కాలం పాటు ఎంతో అన్యోన్యంగా గడిపిన ఈ జంట.. ఈ స్పెషల్ రోజును ప్రత్యేకంగా విషెస్ తెలుపుకున్నారు.. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..
కత్రినా కైఫ్ విక్కీ కౌశల్ రాజస్థాన్లోని సిక్స్త్ సెన్స్ ఫోర్టులో గత ఏడాది ఇదే రోజున పెళ్లి చేసుకున్నారు.. అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్ళికి ఎందరో అతిరథ మహారాధులు వచ్చారు.. పెళ్ళికి ముందుకు చాలా కాలం పాటు డేటింగ్ లో ఉన్న ఈ జంట తమ ప్రేమ విషయాన్ని తెలిపి అందరికీ షాక్ ఇచ్చారు.. పెళ్లి తర్వాత మాత్రం ఎన్ని టూర్లు వెకేషన్కు వెళ్ళిన తమ జీవితాన్ని సీక్రెట్ గానే ఉంచుతూ వివాహ బంధంలో మాధుర్యాన్ని ఎంజాయ్ చేస్తున్నారు.. అయితే తాజాగా ఈ ప్రత్యేక రోజు సందర్భంగా వీరిద్దరూ ఒకరికొకరు స్పెషల్ విషెస్ తెలుపుకున్నారు.. అలాగే ఏడాది పాటు సాగిన వివాహా బంధంలో ఒకరిపై మరొకరికి ఇంకా ప్రేమ పెరిగిందని వెల్లడించారు.
‘నా కాంతి కిరణమా.. హ్యాపీ వన్ ఇయర్’ అని ట్వీట్ చేస్తూ.. రెండు ఫొటోలనూ పంచుకుంది కత్రినా కైఫ్. అలాగే భర్త డాన్స్ చేస్తున్న మరో వీడియోను పోస్ట్ చేసింది. అలాగే భర్త విక్కీ కౌషల్ కూడా కత్రినా కి స్పెషల్ విషెస్ తెలిపారు.
“నీ ప్రేమలో ఏడాది సమయం చాలా అద్భుతంగా గడిచింది. మన వివాహా వార్షికోత్సవానికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నేను నిన్ను ఎప్పటికన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను… ” అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి వీరిద్దరికీ పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు..