Entertainment’కేజీఎఫ్’ సినిమా చూశారా? అంటే.. ఎన్నిసార్లు చూశావ్ అని అడగాలి గానీ, అదేం పిచ్చి ప్రశ్న అని రిటర్న్ కౌంటర్ వేస్తారేమో. ఎందుకంటే ఫుల్ ఆన్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తీసిన రెండు చిత్రాలు.. వందల కోట్లు సాధించాయి. కన్నడ సినిమాకు ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకొచ్చాయి. ఇక ఈ సినిమా ఫస్ట్ పార్ట్ లో నరాచీలో విలన్స్ ని హీరో చితక్కొట్టే ఫైట్ సీన్ ఒకటి ఉంటుంది. అందులో నటించిన ఓ తాత కూడా చాలా ఫేమస్ అయ్యాడు. ఇప్పుడు ఆ తాతనే హీరోగా పెట్టి ఏకంగా సినిమా తీసేశారు. ‘కేజీఎఫ్’ తాత కృష్ణోజీ రావుని ప్రధాన పాత్రలో పెట్టి ‘ఒక సె*క్స్ టెంట్ కథ’ సినిమా తీశారు. దాని తెలుగు ట్రైలర్ తాజాగా రిలీజై, ఆడియెన్స్ ని ఎంటర్ టైన్ చేస్తోంది.
ఇక సినిమా కథ విషయానికొస్తే.. సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్ గా చేసే నారాయణ.. అలియాస్ నానో నారాయణ, ‘కేజీఎఫ్’ తర్వాత చాలా ఫేమస్ అవుతాడు. భార్యతో కలిసి హ్యాపీగా ఉంటాడు. ఇంతలో తన భార్య అరుదైన వ్యాధి బారిన పడుతుంది. ఆమెకి నయం కావాలంటే రూ.20 లక్షలు అవసరమని డాక్టర్స్ చెబుతారు. నారాయణ ఎంత ప్రయత్నించినా సరే డబ్బు దొరకదు. దీంతో తన దగ్గరున్న ‘విక్టోరియన్ సెక్స్ టెంట్ బైనాక్యూలర్’ అనే వస్తువు ఒకటుంటుంది. దీంతో చూస్తే మనషులు నగ్నంగా కనిపిస్తారు. దీంతో ఈ బైనాక్యూలర్ ఎవరెవరి దగ్గరకు వెళ్లింది? అనేదే స్టోరీ.