Chiranjeevi : చిరంజీవి హీరోగా వస్తున్న భోళా శంకర్ సినిమా ఆగస్టు 11న రాబోతుంది దీనికి మొహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నాడు .. భోళా శంకర్ సినిమాలో చిరంజీవి సరసన తమన్నాహీరోయిన్ గా నటిస్తుంది. కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలుగా నటిస్తుంది. సుశాంత్ ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. తాజాగా కీర్తి సురేష్ ఇంటర్వ్యూ ఇవ్వగా పలు ఆసక్తికర విషయాలని తెలిపింది.
హీరోయిన్ కీర్తి సురేష్ భోళా శంకర్ సినిమాలో చిరంజీవికి చెల్లెలుగా నటిస్తుంది. అయితే కీర్తి సురేష్ తల్లి మేనకా సురేష్ కూడా ఒకప్పుడు స్టార్ హీరోయిన్. మేనక 1980లో వచ్చిన చిరంజీవి పున్నమినాగు సినిమాలో చిరంజీవి సరసన హీరోయిన్ గా నటించింది. ఇప్పుడు మేనక కూతురు కీర్తి చిరంజీవి చెల్లెలిగా నటించడం విశేషం. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కీర్తి సురేష్ దీనిపై స్పందించింది.
కీర్తి సురేష్ మాట్లాడుతూ.. చిరంజీవి గారితో అమ్మ పున్నమినాగు చిత్రంలో నటించారు. అప్పటి చాలా విషయాలు అమ్మ నాకు చెప్పింది. చిరంజీవి గారి ఎనర్జీ, డెడికేషన్, అలాగే సెట్ లో ఇచ్చిన సలహాలు సూచనలు గురించి చెప్పింది. చాలా కేరింగ్ గా చూసుకునేవారట. అమ్మ చాలా చిన్న వయసులో సినిమాల్లో వచ్చింది. అప్పుడు ఒక చిన్న పాపకి చెప్పినట్లు అన్ని విషయాలు చెప్పారట. ఈ విషయాన్ని చిరంజీవి గారితో నేను చెప్పినపుడు చిరంజీవి రియాక్షన్ నాకు చాలా సర్ప్రైజ్ చేసింది. ‘’మీ అమ్మగారు ఇంతే చెప్పిందా.. నేను తనతో ఇంకా చాలా చెప్పాను’ అన్నారు. అప్పుడు చెప్పిన ప్రతి చిన్న విషయం ఆయనకి గుర్తుంది. ఇన్నేళ్ళ తర్వాత కూడా ఆయన ఇంత గుర్తుపెట్టుకొని చెప్పడం అంటే మామూలు విషయం కాదు అంటూ అన్నీ విషయాలు తెలిపింది .