Entertainment మహానటిగా మంచి పేరు సంపాదించుకున్న హీరోయిన్ కీర్తి సురేష్ చాలా వరకు వివాదాలకు దూరంగా ఉంటూ తన మీద ఎలాంటి రూమర్స్ రాకుండా జాగ్రత్తగా కెరియర్ లో నడుచుకుంటూ వెళుతుంది ఈ భామ అయితే తాజాగా ఇండస్ట్రీలో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ పై మాట్లాడింది కీర్తి..
ఇప్పటికే పలువురు హీరోయిన్లు ఇండస్ట్రీలో ఉన్న క్యాస్టింగ్ కౌచ్ పై మాట్లాడారు… దీనిని ఎదుర్కొంటూనే ఉన్నామని అంతేకాకుండా ఎన్నోసార్లు దీనివల్ల బాధపడిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు తాజాగా మహానటి కీర్తి సురేష్ ఈ విషయంపై స్పందించారు.. “చాలామంది హీరోయిన్లు ఇండస్ట్రీలో తమకు ఎదురైనా చేదు అనుభవాలను నాతో పంచుకున్నారు కాస్టింగ్ కౌచ్ తో బాధపడ్డామని తెలిపారు అయితే ఇప్పటివరకు నేను అలాంటి పరిస్థితిని ఎదుర్కోలేదు నన్ను ఎవరు కమిట్మెంట్ అడగలేదు ఒకవేళ నన్ను ఎవరైనా అడిగే పరిస్థితి వస్తే కచ్చితంగా నో అని చెప్తాను దాని వలన సినిమాలు కు నేను దూరమైనా అవకాశాలు రాకపోయినా బాధపడను ఇక్కడి నుంచి దూరంగా వెళ్లి ఏదైనా ఉద్యోగం చేసుకుంటాను అంతే తప్ప మనసుకు నచ్చిన పని చేయాల్సిన అవసరం లేదంటూ.. ” చెప్పుకొచ్చింది కీర్తి సురేష్..
అయితే గత కొన్నేళ్లుగా కీర్తి సురేష్ చేస్తున్న సినిమాలన్నీ ఇండస్ట్రీ వద్ద బోల్తా పడ్డాయి అయితే త్వరలోనే కీర్తి పెళ్లి చేసుకోబోతుందని ఇది కూడా ఇంట్లో వాళ్ళు చూపించిన సంబంధం అనే వార్తలు వినిపిస్తున్నాయి.. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలి అంటే కొన్నాళ్ళు ఆగాల్సిందే..