టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వారాహి చలనచిత్రం, హై బడ్జెట్ ఎంటర్‌టైనర్‌లతో పాటు కంటెంట్ ఆధారిత సినిమాలను రూపొందించడంలో పేరుగాంచిన రాధా కృష్ణ దర్శకత్వంలో తెలుగు-కన్నడ ద్విభాషా చిత్రంతో కిరీటిని హీరోగా పరిచయం చేయనుంది.
ఇంకా పేరు పెట్టని ఈ చిత్రం భారీ స్థాయిలో నిర్మించబడుతుంది. ఈ చిత్రం కిరీటికి గుడ్ లాంచ్ కానుంది. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో కొందరు ప్రముఖ నటీనటులు నటించనున్నారు. విభిన్న క్రాఫ్ట్‌లను నిర్వహించడానికి మేకర్స్ అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులను కూడా ఎంచుకున్నారు.తారాగణం: కిరీటి
సాంకేతిక సిబ్బంది: రచయిత, దర్శకుడు: రాధా కృష్ణ, నిర్మాత: సాయి కొర్రపాటి, సంగీతం: దేవి శ్రీ ప్రసాద్, DOP: K సెంథిల్ కుమార్, ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్, స్టంట్ డైరెక్టర్: పీటర్ హెయిన్, PRO: వంశీ-శేఖర్.