Hallowin Incident : దక్షిణ కొరియా రాజధాని సియోల్లో హాలోవీన్ సందర్భంగా జరిగిన తొక్కిసలాట గురించి అందరికీ తెలిసిందే. ఈ విషాద గతనతో యావత్ ప్రపంచమంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఈ తొక్కిసలాటలో ప్రముఖ నటుడు, కే పాప్ సింగర్ లీ జిహాన్ కూడా మరణించినట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఆయన మరణవార్తను ఏజెన్సీ 935 ఎంటర్టైన్మెంట్ ధృవీకరించింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా… 935 ఎంటర్టైన్మెంట్ , 9 ఎటో ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ ఒక అమూల్యమైన సభ్యుడు, నటుడు లీ జిహాన్ ని కోల్పోయింది. లీ మమ్మల్ని విడిచిపెట్టి తిరిగిరాని లోకాలకు చేరుకున్నాడు అంటూ పేర్కొంది.
24 ఏళ్ల లీ జిహాన్ కొరియన్ సింగింగ్ కాంపిటీషన్ ప్రొడ్యూస్ 101లో పాల్గొన్నాడు. టుడే వాజ్ అనదర్ నేమ్ హ్యూన్ దేతో టెలివిజన్ రంగంలో అడుగు పెట్టాడు. ఈరోజు లీ జిహాన్ అంత్యక్రియలు నిర్వహించారు. పలువురు నటులు, సింగర్స్ , అభిమానులు అంత్యక్రియలకు హాజరయ్యారు. అలానే ఈ తొక్కిసలాటలో మరణించిన వారి సంఖ్య 153కి చేరుకోగా… మరో 133 మంది క్షతగాత్రులు వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. గాయపడిన 39 మంది పరిస్థితి విషమంగా ఉన్నందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని హోం మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు.
దీంతో దక్షిణ కొరియాలో ఒక వారం జాతీయ సంతాప దినాలుగా పాటించాలని అధ్యక్షుడు యూన్ సుక్ ప్రకటించారు. ప్రభుత్వ భవనాలు, ప్రభుత్వ కార్యాలయాల సహా బహిరంగ ప్రదేశాల్లో జాతీయ జెండాను సగం మాస్ట్గా ఉంచాలని ఆదేశించారు. తప్పిపోయిన వారి బంధువుల గురించి తెలియ జేయడానికి వేలాది మంది ప్రజలు ప్రభుత్వ కార్యాలయాన్ని సంప్రదించారని… తొక్కిసలాట తర్వాత గాయపడిన వారిలో లేదా మరణించిన వారిలో తప్పిపోయిన వారు ఉన్నారా అని ధృవీకరించాలని అధికారులను కోరుతున్నారు. ఇటువంటి ఘటనలు ప్రపంచవ్యాప్తంగా కూడా విషాదాన్ని నింపుతున్నాయని పలువురు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.






















