Lokesh Yuvagalam Padayatra 3000+ Kilometers, TDP Party Lokesh Babu Latest,Latest Telugu news,AP Politics,TDP vs YSRCP,www.teluguworldnow.com,TNN Telugu News,@TeluguNewsNetwork,#Yuvagalam,#Lokesh,#TDPParty

Lokesh Yuvagalam Padayatra : లోకేష్ స‌మ‌ర్ధ నాయ‌కుడు అయిపోయిన‌ట్టేనా ? ప్ల‌స్ పాయింట్స్ ఏంటి ? మైన‌స్ పాయింట్స్ ఏంటి ?

ఈ మేకోవ‌ర్ నిజంగా టీడీపీ వింగ్ త‌యారీయా లేక త‌న ప్ర‌త్య‌ర్ధిని జ‌గ‌నే తయారు చేసుకున్నాడా ?

ప్రత్యేక కధనం by సీనియర్ జర్నలిస్ట్ ఆది

లోకేష్ ఇప్పుడిప్పుడు కొద్దిగా రాజ‌కీయ ప‌రిజ్ఞానంతో మాట్లాడుతున్నాడు. కొంత అనుభ‌వం వ‌చ్చిన‌వాడిలా క‌నిపిస్తున్నాడు. ఒక‌ప్పుడు త‌న తండ్రి మంత్రి మండ‌లిలో తాను కూడా ఒక మంత్రిగా కూర్చున్న‌ప్పుడు.. త‌నకు రైతు గోస ఏమీ అర్ధం కాక పోయేద‌నీ. కానీ ఇప్పుడు ఒక అభిప్రాయం అంటూ ఏర్ప‌డింద‌నీ. పాద‌యాత్ర‌లో ఎదురైన‌ రైతాంగం త‌మ వెత‌లు చెప్పుకున్న‌ప్పుడు.. అలాక్కాదు ఇలా చేస్తే బావుంటుంది క‌దా? అన్న స‌ల‌హా సూచ‌న‌లు ఇస్తున్న‌పుడు.. కొంత అవ‌గాహ‌న ఏర్ప‌డింద‌నీ. పాద‌యాత్ర‌కు ముందు త‌ర్వాత లోకేష్ లో మార్పు నిజంగానే వ‌చ్చింద‌న్న మాటైతే వినిపిస్తోంది. దానికి తోడు గ‌తంలో త‌న‌ది అంద‌రూ అన్న‌ట్టుగానే ఎంప్టీ మైండేన‌నీ లోకేష్ సైతం ఒప్పేసుకున్నాడు.

మొత్తానికైతే స‌గం మెటీరియ‌ల్ ఏదో ఒక‌టి రెడీ అయ్యిందని చెప్పాలి. మ‌రి కంప్లీట్ మెన్ గా ఎప్పుడు రెడీ అయ్యేట్టు.. రేమండ్? అన్న ప్ర‌శ్న వినిపిస్తోంది. అద‌స‌లు సాధ్య‌మేనా? ఇప్ప‌టి వ‌ర‌కూ లోకేష్ ను వెంటాడి వేధించిన స‌మ‌స్య‌లేంట‌ని చూస్తే.. అస‌లు లోకేష్ త‌యారీలోనే భారీ తేడా ఉందని చెప్పాలి. భాష‌, భావ‌ము స్ప‌ష్టంగా త‌న తండ్రి నుంచి కానీ త‌ల్లి ద‌గ్గ‌ర‌గానీ ఆయ‌న నేర్చుకున్న‌దే లేదంటారు ఆయ‌న్ను బాగా ద‌గ్గ‌రి నుంచి అబ్జ‌ర్వ్ చేస్తున్న వారు. స్వ‌యానా లోకేష్ సైతం.. ఈ మాట చెప్పుకున్న ప‌రిస్థితులు. త‌న తండ్రిని తాను ద‌గ్గ‌ర్నుంచి చూసిన‌ది అంతంత మాత్ర‌మేన‌ని. ఆయ‌న ఆల్వేస్ పొలిటిక‌ల్ గా బిజీ బిజీ అంటూ త‌ర‌చూ ఎంతో గొప్ప‌గా చెప్పుకునేవారు.

ఒక సాధార‌ణ తండ్రిద‌నం ద్వారా నేర్చుకోవల్సిందీ నేర్చుకోక‌. తొలిగురువైన‌ త‌ల్లి నుంచి కూడా స‌రైన ఆల‌నా పాల‌నా అంద‌క పోవ‌డం వ‌ల్ల‌.. లోకేష్ అంద‌రూ అంటున్న‌ట్టు నిజంగానే ఒక‌ పప్పు కింద‌ త‌యార‌య్యాడు. ఆ క‌ల్ట్ లో ఒక మేకోవ‌ర్ ఉండాల్సింది ఎక్క‌డో ఏదో మిస్స‌య్యింది. దానికి తోడు త‌ల్లికి తెలుగు భాష మీద స‌రైన‌ ప‌ట్టులేక పోవ‌డం. తండ్రికి ఉన్నా.. అదేమీ అంత ప్యూర్ కాక పోవ‌డం. ప‌క్కా తెలుగు మాట్లాడే నంద‌మూరి తార‌క‌రామారావుగారి గారాల‌ప‌ట్టిగా పుట్టిన భువ‌నేశ్వ‌రి అదేంటో పురంధేశ్వ‌రి లాగా కూడా తెలుగును మేనేజ్ చేయలేక పోవ‌డం వెర‌సీ.. జ‌నం చావుకొచ్చిన‌ట్టయ్యింది. అబ్బ‌బ్బ ఆ భాషేంటి దాని భావ‌మేంటి? అర్ధ తాత్ప‌ర్య‌మేంటి.. దేవుడా! అని త‌ల‌ప‌ట్టుకోకుండా ఉండ‌లేం అంటారు భాషాభిమానులు. మొన్నంటే మొన్న‌.. లోకేష్ ఒక్కొక్క‌రికీ 15 వేల చొప్పున ముగ్గురికి నెల‌కు 90 వేలిస్తామ‌ని అన‌డం బ‌ట్టీ చూస్తుంటే.. స్టాన్ ఫోర్డ్ లో చ‌దువుకున్నాడా లేక‌.. ఎక్క‌డైనా వీధిబ‌డిలోనా? అన్న ప్ర‌శ్న త‌లెత్తింది.

దానికి తోడు లోకేష్ త‌ల్లి త‌మిళ‌నాడులో పుట్టి అక్క‌డ నేర్చుకున్న అర‌కొర అరం భాష‌కు తోడు.. త‌న భ‌ర్త ద్వారా సంక్ర‌మించిన సీమ భాష కూడా స‌రైన భాష కాక పోవ‌డంతో.. ఆమె భాష అష్ట‌వంక‌ర‌లు తిర‌గ‌డం కార‌ణంగా.. భావం కూడా మెలితిరిగిపోతోంది. అలా తల్లి నుంచి సంక్ర‌మించిన‌ అసంబ‌ద్ధ‌\ అర్ధర‌హిత‌ భాష నేర్చుకున్న లోకేష్ భావాన్ని కూడా స‌రిగా ప‌ల‌క‌లేక‌పోతున్నాడు. దీంతో లోకేష్ ది ప్ర‌త్యేక భాష‌గా త‌యారైంది. ఆయ‌న వాడే ప‌దాలు.. చాలా చాలా చిత్రంగా ఉంటాయి. ఆయ‌న‌కీ భాష వ‌చ్చిందే భువ‌నేశ్వ‌రి మాత‌ నుంచి అని అంటారు. ఆమె ముంద‌ర అనే ప‌దాన్ని మంద‌ల అంటుంది. ఆ మాట‌కొస్తే అచ్చ‌తెలుగులో ఆమెకు చాలా చాలా ప‌దాలు తెలియ‌వు. దీంతో తల్లినుంచి పుణికిపుచ్చుకున్న భాష‌తో లోకేష్ భాషా ప్ర‌వీణ లాగా.. భాషా విహీన వంటి బిరుదుల‌కొక‌ బ్రాండ్ అంబాసిడ‌ర్ అయిపోయాడు.

లోకేష్ ను తీరుబాటుగా కూర్చోబెట్టి మాట్లాడితే ప్ర‌స్తుతానికైతే ప‌ర్లేదు. కానీ ఒక స‌మూహం మధ్య‌.. భారీ స‌భ‌లూ\ స‌మావేశాల‌పుడు మాట్లాడే మాట‌లు త‌ర‌చూ త‌డ‌బ‌డుతుంటాయ్.. పైకి లేపండీ అంటాడు ఎందుకంటాడో ఏంటో అర్ధం కాదు. ఏం లేపాలో స్ప‌ష్ట‌త లేక పోవ‌డంతో అది పూర్తి బండ బూతుగా త‌యార‌య్యి.. మీమ్స్ వండివార్చేవాళ్ల‌ చేతికి ఓ ల‌డ్డూలా చిక్కిపోతోంది. దీంతో అదో సంద‌డి కింద మారిపోయింది.

దీనంత‌టికీ కార‌ణం భాష‌. నాకు తెలిసి.. ఆయ‌న‌ క్రూ త‌న‌కు ఏదైనా స‌బ్జెక్ట్ రాసిచ్చేట‌పుడు.. ఇంగ్లీష్ లో రాసిస్తారు కావ‌చ్చు. ఉదాహ‌ర‌ణ‌కు వంతెన అని రాయాల‌నుకోండి. వాళ్లు దాన్ని vantena అని రాస్తారు కాబోలు. దాన్ని కూడుకుని చ‌దివే లోకేష్ వంటె వంటె అంటూ ఒంటెకింద మార్చేస్తాడు. దీంతో అది మీమ‌ర్ల‌కు మాంచి ఫుల్ మీల్స్ కింద దొరుకుతోంది.

ఒక నాయ‌కుడికి భాష పెద్ద విష‌యం కాదు.. కానీ భావావేశం మాత్రం చాలా చాలా ముఖ్యం. ఆ భావావేశం కావాలంటే.. అత‌డికంటూ ఒక జీవితం గురించి క్షుణ్ణంగా తెలియాలి. దాని ద్వారా అత‌డు త‌న‌తో స‌మాన‌మైన ఇత‌ర జీవితాల గురించి ఒక అవ‌గాహ‌న పెంచుకోవాలి. త‌ద్వారా.. అత‌డికి ఈ స‌మాజం ప‌ట్ల ఒక ఐడియాల‌జీ ఏర్ప‌డాలి.. దాని ద్వారా.. ఒక రాజ‌కీయ విధానం త‌యారు కావాలి. ఆ ఒక్క‌టి సాధించేస్తే.. ఇక అంతా అయిపోతుంద‌ని.. స్ప‌ష్టంగా ఇత‌రుల‌కు చెప్పగ‌ల‌గాలి. అది అత్యంత విశ్వ‌స‌నీయంగానూ ఉండాలి.

దానికి తోడు త‌ల్లిదండ్రులు వారి వారి కుటుంబ నేప‌థ్యం.. వంటి వ్య‌వ‌హారాలు పైకి ఎంత గొప్ప‌గా ఉన్నా.. లోలోన మాత్రం పూర్తి భిన్న‌మైన వాతావ‌ర‌ణంలో.. లోకేష్ ని పెంచార‌నిపిస్తోంది. చిన్న‌నాటి నుంచీ అత‌డిలో ఒక రాజ‌కీయ జిజ్ఞాస‌ను తీసుకు రావాల్సింది. త‌ద్వారా.. కొన్ని విలువ‌ల‌ను నూరి పోయాల్సింది. కానీ అలాంటివేం జ‌రిగిన‌ట్టు క‌నిపించ‌డం లేదు. చంద్ర‌బాబు ఆయ‌న రాజ‌కీయ\ వ్యాపారాత్మ‌క ధోర‌ణి.. లాభాపేక్ష‌.. త‌ద్వారా తాను ఈ స‌మాజాన్ని అందులోంచి తాను చేసిన‌ రాజ‌కీయాన్ని.. చూస్తూ పెరిగాడు లోకేష్.

లోకేష్ కంటూ ఒక సొంత భావ‌.. జాలం గానీ, మ‌ర‌ద‌లు.. జాలంగానీ లేదు. ఒక వేళ తాను నిజంగా ఒక రాజ‌కీయ నాయ‌కుడిగా పేరు సాధించాల‌నుకుని ఉంటే.. అత‌డు త‌న మ‌ర‌ద‌లు బ్రాహ్మ‌ణిని అస్స‌లు పెళ్లాడి ఉండ కూడ‌దు. ఇదంతా ఆ కుటుంబం, వారి కులం, దాని తాలూకూ లాభ‌న‌ష్టాల బేరీజు వ్య‌వ‌హారం కింద‌కు వ‌చ్చిన‌ది. త‌ర‌చి చూస్తే లోకేష్ వివాహం అనే విష‌యంలో ఏం క‌నిపిస్తుందంటే?నారా\ నంద‌మూరి కుటుంబాల‌కు సంబంధించిన‌ ఆస్తులు క‌లుపుకోవ‌డం, రాజ‌కీయంగా ఎలాంటి విబేధాలు రాకుండా జాగ్ర‌త్త వ‌హించ‌డం త‌ప్ప ఇందులో మ‌రెలాంటి మేజిక్ లేదు.

దానికి తోడు.. మేన‌రికం క‌లుపుకోవ‌డం వ‌ల్ల హై బ్రిడ్ పిల్ల‌లు పుట్టే ఛాన్స్ లేదు. స‌రిక‌దా.. అది మ‌రింత త‌క్కువ మాన‌సిక శారీర‌క ధారుఢ్యం గ‌ల‌ పిల్ల‌లు పుట్టేందుకు ఆస్కార‌మేర్ప‌డుతుందని చెబుతుంది సైన్సు. నిజంగా లోకేష్ ని ఒక మాస్ లీడ‌ర్ గా త‌యారు చేయాల‌ని త‌న‌కు గానీ త‌న తండ్రికిగానీ ఉండి ఉంటే.. మొన్న ఒక మ‌హిళ అత్యుత్సాహం కొద్దీ పిలిచిన్న‌ట్టు.. మా ద‌ళిత మేన‌ల్లుడు(అనుకుంట‌) దేవాన్ష్ అని సంబోధించిన‌ట్టుగా ఏ ద‌ళిత అమ్మాయినో పెళ్లాడి ఉండాల్సింది. అంత కులం నిచ్చెన‌ దిగ‌లేమ‌నుకుంటే క‌నీసం ఏ రెడ్ల అమ్మాయినైనా చేసుకుని ఉండేవాడు. ఇప్పుడు జ‌గ‌న్ మేన‌ల్లుడు రాజారెడ్డి చూడండీ.. అట్లూరి ప్రియ అనే క‌మ్మ వారి అమ్మాయిని ఎలా పెళ్లాడుతున్నాడో. అద్దీ అట్లీస్ట్ అలాగైనా ఉండాల్సింది కాంబో అంటే. కానీ, ఇలాంటి ఆలోచ‌న‌ త‌న‌కూ లేదు. త‌న త‌ల్లిదండ్రుల‌కూ అలాంటి ఆద‌ర్శ భావాల్లేక పోవ‌డంతో.. వాళ్లేం చెబితే అది త‌లాడిస్తూ చేసేశాడు లోకేష్. ఇందులో మ‌రో దుర‌దృష్ట‌మేంటంటే.. ఆ మ‌ర‌ద‌లి ద్వారా అయినా ఎక్కువ మంది సంతానాన్ని క‌న్నాడా అంటే అదీ లేదు. ఒంటికాయ సొంటికొమ్ములా ఒక్క‌డు. వాడిపై మూడో త‌రం టీడీపీ భ‌విత‌వ్యం ఆధార‌ప‌డి ఉంది. రెండో త‌రంలోనే బాబు త‌ద‌నంత‌రం లోకేష్ మీద ఆధార ప‌డ్డం వీలుకాద‌న్న ఉద్దేశంతో.. మోక్ష‌జ్ఞ ను ప్రిపేర్ చేస్తున్నార‌న్న మాట వినిపిస్తోంది. అలాంటిది త‌ర్వాతి భారం ఒక్క దేవాన్ష్ మీద సాధ్య‌మేనా? అన్న మాట వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. ఇప్పుడు పాద‌యాత్ర ద్వారా లోకేష్ 40 ఏళ్ల‌కు స‌రిప‌డా రాజ‌కీయ ప‌రిజ్ఞానం సంపాదించేశాడ‌ని త‌మ్ముళ్లంతా క‌ల‌సి ఎక‌బికిన‌ ఊద‌ర‌కొడుతుంటే.. అది వారి వారి సున‌కానందం\ స్వ‌కుచ మ‌ర్ధ‌నం కింద కొడుతోంది త‌ప్ప‌.. మ‌రెక్క‌డా అందుకు త‌గిన ఆధారాలు క‌నిపించ‌డం లేదు. ఏ కోశాన చూసినా లోకేష్‌ శ‌క్తిసామ‌ర్ధ్యాలు పెరిగిన‌ట్టు క‌నిపించడం లేదంటారు విమ‌ర్శ‌కులు. ఒక వేళ అత‌డెన్నో ఆటు పోట్లు ఎదుర్కున్నార‌ని చెప్పాల్సి వ‌స్తే.. ఇందులో స‌గం విధి విచిత్రి, మ‌రో స‌గం జ‌గ‌న్ ఏర్ప‌రిచిన హార్డిల్స్.. కారణంగా అత‌డిలో ఈ ర‌కంగా అయినా ఒక‌ పోరాట ధోర‌ణి పెరిగిన‌ట్టు తెలుస్తోంది.

ఇక విధి విచిత్ర సంగ‌తేంట‌యా అంటే పాద‌యాత్ర‌ తొలి రోజే తార‌క‌ర‌త్న గుండెపోటు రూపంలో అయ్యో లోకేష్ టైమే స‌రిగా లేద‌న్న మాట వినిపించ‌డం ద్వారా.. అయ్యో పాపం అన్న చిన్న‌పాటి సింప‌తీని క్రియేట్ చేసింది. రెండోది.. తండ్రి జైలు ఘ‌ట‌న‌. ఇందుకు లోప‌లి కార‌ణంగా బీజేపీని ఎత్తి చూపుతున్నా.. పైకేమో అది జ‌గ‌న్ ఖాతాలో ప‌డ్డ‌ది కాబ‌ట్టి.. ఆ కాస్త‌ పేరు కూడా ఆయ‌న లాగేసుకున్న‌ట్టు క‌న‌బ‌డుతోంది.

స‌రే త‌న పాద‌యాత్ర ద్వారా.. ఏదైనా పూర్తిగా నేర్చుకునే య‌త్నం చేశాడా? అంటే, కొన్ని స‌మావేశాల్లో.. మ‌రీ ముఖ్యంగా నిర్వాసితులు, పోడు భూముల రైతుల‌కు సంబంధించిన ఆ స‌భ‌ల్లో త‌న‌కా సెక్ష‌న్లే తెలీవ‌నీ.. తాను కూడా స్ట‌డీ చేయాల్సి ఉంటుంద‌నీ చేతులెత్తేశాడు. నిజానికి ఇలాంటి చోట్ల‌కు వ‌చ్చిన‌పుడు క‌నీసం.. గుగుల్ చేసినా.. కొంత‌మేరైనా స‌మాచారం ల‌భించేది. వాటి ద్వారా తానొక అవ‌గాహ‌న పెంచుకుని మాట్లాడాల్సింది. అదీ జ‌ర‌గ‌ లేదు. దానికి తోడు త‌న పాద‌యాత్ర ద్వారా వీరి వీరి క‌ష్ట‌న‌ష్టాల‌ను తాను న‌మోదు చేశాన‌ని చెప్ప‌కుండా.. రెడ్ బుక్ త‌యారు చేశాన‌ని చెప్ప‌డం.. మ‌రో పొలిటిక‌ల్ పొర‌బాటుగా క‌నిపిస్తోంది. ఇలా పుంఖాను పుంఖాలుగా లోపాల‌ను పోగు చేసుకుంటున్న లోకేష్ లో న‌ల‌భై ఏళ్ల‌కు స‌రిప‌డా రాజ‌కీయ భావావేశం ఎలా పోగ‌య్యిందో వారికే తెలియాలంటున్నారు విశ్లేష‌కులు

ప్రత్యేక కధనం by సీనియర్ జర్నలిస్ట్ ఆది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *