Suicide Case : జీవితంలో ఎప్పటికైనా చావు అనేది పరిష్కారం కానే కాదు. అంతా మనం అనుకున్నట్లు జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది. ఈ విషయాన్నే నేటి తరం యువత అర్దం చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు తాజాగా చోటుచేసుకున్న ఈ ఘటన కూడా ఆ కోవలోకే వస్తుంది. ప్రేమించుకున్న ఓ జంటను కులం పేరుతో వారి పెద్దలు విడదీశారు కానీ… వారి మనసుల్ని మాత్రం వేరు చేయలేకపోయారు. అందుకే వేర్వేరుగా ఉండలేక, కలిసి చనిపోవాలని ఆ జంట నిర్ణయించుకొని ఈ లోకాన్ని వీడారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే… హైదరాబాద్‌కు చెందిన అనూష (21) కు రెండేళ్ల క్రితం తూర్పు గోదావరి జిల్లాకు చెందిన గుడ్ల పోసిబాబుతో వివాహంతో జరిగింది. కాగా ఈ జంట కొవ్వూరులో నివాసం ఉంటున్నారు. అయితే అనూష పెళ్లి కాక ముందే షాపూర్ ప్రాంతానికి చెందిన కృష్ణారావుతో ప్రేమలో పడింది. వీళ్లు పెళ్లి కూడా చేసుకోవాలని నిర్ణయించుకుని… వారి తల్లిదండ్రులకు విషయం చెప్పారు. కానీ కులాలు వేరు కావడంతో వారి పెద్దలు పెళ్లికి అంగీకరించలేదు. దీంతో అనూషకు రెండేళ్ల క్రితం పోసిబాబు అనే వ్యక్తితో వివాహం జరిపించారు. పెద్దల ఒత్తిడితో అనూష అయిష్టంగానే ఆ పెళ్లి చేసుకుందని… కృష్ణారావుని మరువలేక పెళ్ళైనా తర్వాత కూడా అతనితో అనుబంధం కొనసాగించింది.
కానీ జీవితాంతం ఇలా కలిసి ఉండలేం అని చావులోనైనా కలిసుందామని ఆ జంట భావించింది. ఈ నేపథ్యం లోనే ఈనెల 5వ తేదీన ఇద్దరూ కలిసి తిరుపతికి వెళ్లారు. అక్కడ త్రిలోక్ లాడ్జిలో రూమ్ బుక్ చేసుకున్నారు. ముందుగా అనుకున్నట్టుగానే… అక్కడే ఫ్యాన్‌కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కాగా మంగళవారం ఉదయం వాళ్లు ఎంతసేపటికీ బయటికి రాకపోవడంతో… లాడ్జి సిబ్బందికి అనుమానం వచ్చి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. కాగా ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.