Entertainment మాలేక ఆరోరా సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బజ్ఖాన్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.. వీరిద్దరికీ ఒక కొడుకు కూడా ఉన్నారు అయితే కొన్నాళ్ల అనంతరం పరస్పర అంగీకారంతో వీరిద్దరూ విడిపోయారు అయితే తాజాగా ఆరోరా తన కొడుకు కోసం ఆసక్తికర విషయాలను పంచుకుంది..
తన కొడుకు అర్హన్ ఖాన్ కోసం పలు విషయాలు పంచుకుంది మాలేక అరోరా ఈ సందర్భంగా అతను వయసులో చిన్నవాడైన తనను ఎంత బాగా అర్థం చేసుకుంటాడని ప్రతి విషయంలో తనకు తోడుగా ఉంటాడని చెప్పకు వచ్చింది..
అర్హాన్ ఖాన్.. నన్ను చాలా బాగా అర్థం చేసుకుంటాడు విడాకులు తీసుకోవాలి అని నేను నిర్ణయించుకున్న సమయంలో కూడా నాకు ఎంతో అండగా ఉన్నాడు నేను జీవితంలో ఆనందంగానే ఉన్నా ఏదో కోల్పోతున్నాను అని భావించా ఆ పరిస్థితిని తాను అర్థం చేసుకున్న తీరు నాకు నిజంగా అద్భుతం అనిపించింది ప్రతిక్షణం నాకు అండగా ఉండి నన్ను ఎంతో కేర్ గా చూసుకుంటూ ఉంటాడు.. ఎలాంటి క్షణంలో అయినా నేను తీసుకున్న నిర్ణయం సరైనదే అని అతను భావిస్తాడు అలాగే తాజాగా తన లైఫ్ లో బ్రేకప్ జరిగింది అనే విషయం నాకు తెలియదు ఈ విషయాన్ని నాకు చెప్పలేదు కూడా అలాగే తను తన తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు నేను ఎలాంటి అభ్యంతరం చెప్పను ఇంకా అక్కడ విషయాలు తన ద్వారా నేను తెలుసుకోవాలి అని అసలు అనుకోను.. అలాగే అర్జున్ కపూర్ తో నా రిలేషన్ ను కూడా చాలా బాగా అర్థం చేసుకున్నాడు ఈ విషయంలో నాకు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు సరి కదా నా వెంట ఉండి ప్రతిక్షణం నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు అంటూ చెప్పుకొచ్చింది..