నైట్రో స్టార్ సుధీర్ బాబు, యాక్టర్ -ఫిల్మ్ మేకర్ హర్షవర్ధన్ దర్శకత్వంలో చేస్తున్న యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ ‘మామా మశ్చీంద్ర’. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పిపై నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మించిన ఈ చిత్రం టీజర్ ట్రైలర్ తో పాజిటివ్ బజ్ ని క్రియేట్ చేసింది. తెలుగు, హిందీ భాషల్లో రూపొందిన ఈ ద్విభాషా చిత్రాన్ని సృష్టి సెల్యులాయిడ్ సోనాలి నారంగ్, సృష్టి సమర్పిస్తున్నారు. అక్టోబర్ 6న సినిమా విడుదలౌతున్న నేపధ్యంలో మేకర్స్ ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. హీరోలు శర్వానంద్, విశ్వక్ సేన్, శ్రీవిష్ణు, డైరెక్టర్ శేఖర్ కమ్ముల ముఖ్య అతిధులుగా పాల్గొన్న ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది.
ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో సుధీర్ బాబు మాట్లాడుతూ.. ఈ వేడుకకు ముఖ్య అతిధులుగా వచ్చిన శర్వానంద్, విశ్వక్ సేన్, శ్రీవిష్ణు, శేఖర్ కమ్ముల గారికి ధన్యవాదాలు. నాకు నటుడిగా జీవితాన్ని ఇచ్చిన సూపర్ స్టార్ కృష్ణ గారికి కృతజ్ఞతలు. ఆయన ఆశీస్సులు ఎప్పుడూ వుంటాయని నమ్ముతున్నాను. మామా మశ్చీంద్ర’ కథ నచ్చి సినిమా నిర్మించిన సునీల్ నారంగ్ , పుస్కూర్ రామ్ మోహన్ గారికి థాంక్స్. ఈ సందర్భంగా నారాయణ్ దాస్ నారంగ్ గారిని గుర్తు చేసుకుంటున్నాం. ఆయన్ని మిస్ అవుతున్నాం. మంచి సినిమా చేశాం. ఆయనకి ఈ సినిమా అకింతం చేయొచ్చని అనుకుంటున్నాం.
ఈ సినిమాకి పని చేసిన టీం అందరికీ థాంక్స్. ఈషా చాలా చక్కగా నటించింది. తనకి, దుర్గాకి మధ్య వచ్చే సీన్స్ చాలా ఆసక్తికరంగా వుంటాయి. మిర్నాళిని రవి, నాకు మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు ఖుషి సినిమాని గుర్తు చేస్తాయి. దర్శకుడు హర్ష ఇందులో ఓ కీలక పాత్ర చేశారు. సినిమా పూర్తయ్యే సరికి ఈ పాత్ర చాలా అర్థవంతంగా అనిపిస్తుంది. దర్శకుడిగా తన గురించి చెప్పాలంటే రచయితలు ఆగిపోయిన దగ్గర నుంచి తను మొదలౌతాడు. తన ఆలోచనలు చాలా డిఫరెంట్ గా వుంటాయి. ఇందులో చాలా సర్ప్రైజ్ లు వుంటాయి. ప్రతి పది నిమిషాలకు ఒక మలుపు వస్తుంది. ఈ సినిమాలో పని చేసిన నటీనటులకు సాంకేతిక నిపుణులు అందరికీ పేరుపేరునా థాంక్స్.
ఈ సినిమా నాకు చాలా నచ్చింది. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుందనే నమ్మకం వుంది. దుర్గా పాత్ర గెటప్ వేసుకొని సెట్స్ కి వెళ్ళినప్పుడు చాలా మంది గుర్తు పట్టలేకపోయారు. అలాగే పరశురాం రోల్ కూడా చాలా డిఫరెంట్ గా వుంటుంది. మామ మశ్చీంద్ర’లో మంచి కథ, పాటలు, వినోదం అన్నీ వుంటాయి. కథ యూనిక్ గా వుంటుంది. ప్రతి ఒక్కరికీ ఒత్తిళ్ళు వుంటాయి. మామ మశ్చీంద్ర’ సినిమా చూస్తున్నపుడు ఆ ఒత్తిళ్ళు అన్నీ మరిచిపోతారు. సినిమా మహేష్ బాబు గారిలా పరిగెడుతుంది (నవ్వుతూ). సినిమా చూసి బయటికి వచ్చినప్పుడు కొత్త రకం కథ కొత్తగా వుందని ప్రేక్షకులు ఫీలౌతారు. అక్టోబర్ 6న సినిమా విడుదలౌతుంది. అందరూ థియేటర్స్ లో చూడాలి. మిమ్మల్ని ఖచ్చితంగా అలరిస్తుంది’’ అన్నారు.