vennela kishor breaking news:
ఇప్పటిలో అంధరికి అవసరం అయినధి డబ్బు ,ఇక ఆ డబ్బు విషయానికి వస్తే రీసెంట్ గా 2 వేల నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు శుక్రవారం (మే19) సాయంత్రం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంచలన ప్రకటన చేసింది. దీంతో ఒక్కసారిగా ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. చాలామంది రూ.2 వేల నోట్లను మార్చుకునే పనిలో పడ్డారు. భారత ప్రభుత్వ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అదే సమయంలో రూ.2వేల నోటును ఉపసంహరించుకోవడంపై సామాజిక మాధ్యమాల్లో మీమ్స్ తెగ పుట్టుకొస్తున్నాయి. ఇవి నెటిజన్లను తెగ నవ్విస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ గురించి సినీ హీరో మంచు విష్ణు చేసిన ట్వీట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ‘వెన్నెల కిషోర్ గారి ఇంటికి వెళ్లినప్పుడు ఈ కింది ఫొటో తీసుకొన్నాను. ఇప్పుడు నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే.. వెన్నెల కిషోర్ ఈ నోట్లను ఏం చేస్తాడో అనే ఫీలింగ్ కలుగుతుంది’ అని ట్వీట్ చేశాడు. ఈ ఫొటోలో 2000 వేల రూపాయల నోట్లు కుప్పలు తెప్పలుగా పోసి ఉన్నాయి. మంచు విష్ణు చేసిన ఫోటోపై… నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘మాకు ఓ నోట్ల కట్ట ఇవ్వు అన్నా’ అని కొందరంటే, ‘ఇన్ కం ట్యాక్స్ వాళ్లను పిలవాల్సిందే’ అని మరికొందరూ కామెంట్లు చేస్తున్నా .నిజానికి ఆ ట్వీట్ ఎంధుకు చేసిన అలా 2000 నోట్ల వాడకం ఆపేయమని ఎక్కువగా వుంటే డేంజర్ అనే విషయం అర్ధం చేసుకోవాలి . పాపం వెన్నెల కిషోర్ గారు అలానే అలా 2000 నోట్లు వున్న వాళ్ళ పరిస్తితి ఎలా వుంటుందో చూడాలి ..