Movie : మూవీ అసోసియేషన్ లో శాశ్వత సభ్యత్వం కోసం.. అందులో కొనసాగాలి అంటే ఎలా ఉండాలి అనే విషయాన్ని మా అధ్యక్షుడు మంచు విష్ణు వివరించారు… మా అధ్యక్షుడిగా మంచు విష్ణు ఎన్నికయ్యి ఏడాది కావస్తున్నా సందర్భంలో తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన మాలో సభ్యత్వం కావాలి అంటే కొన్ని విషయాలు తప్పకుండా పాటించాలని.. అంతేకాకుండా ఇందులో కొనసాగుతూ ఎలాంటి క్రమశిక్షణ రాహిత్య పనులు చేయరాదని చెప్పక వచ్చారు.. ‘మా’లో శాశ్వత సభ్యత్వం, ఓటు హక్కుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
మా అసోసియేషన్‌లో సభ్యత్వం కావాలి అంటే కనీసం రెండు సినిమాల్లో నటించి అవి రిలీజ్ అయిన తర్వాతే శాశ్వత సభ్యత్వం కల్పిస్తామని, ఏదైనా ఒక సినిమాలో 5 నిమిషాలైనా కనిపించి డైలాగ్ చెప్పిన వారికి అసోసియేట్‌గా సభ్యత్వం కల్పిస్తామని చెప్పారు. అంతే కాకుండా మెంబర్‌గా నమోదు అయిన ఐదేళ్ల తర్వాత మాత్రమే ఓటు హక్కు లభిస్తుందని ప్రకటించారు. అలాగే ‘మా’ విషయంలో మీడియా ముందుకు వచ్చి ఇష్టమొచ్చినట్లు మాట్లాడినా, విమర్శలు చేసినా, సోషల్ మీడియా పోస్టులు పెట్టినా వారి సభ్యత్వం రద్దు చేయబడుతుందని హెచ్చరించారు.
“ఎవరైనా మా గురించి ఆఫీస్ బేరర్స్ గురించి వ్యక్తిగతంగా తప్పుగా మాట్లాడచ్చు కానీ.. ‘మా’ కుటుంబం గురించి, కళామ్మతల్లి గురించి తప్పుగా మాట్లాడకూడదు. అలా మాట్లాడితే వెంటనే సభ్యత్వం నుంచి తీసేస్తాం. ఐదేళ్ల లైఫ్ టైమ్ మెంబర్షిప్ ఉంటేనే ఓటు హక్కు వస్తుంది. ఇప్పుడు 900 మంది సభ్యులు ఉన్నారు. నా పదవీ కాలం పూర్తయ్యేలోపు ఇంకా 300 మంది చేరుతారు. అందరికీ సౌకర్యాలు కల్పిస్తాం. కానీ, ఓటు మాత్రం ఐదేళ్ల తర్వాతే వస్తుంది. మీ ఇంట్లో గొడవ జరిగితే పెద్దలకు చెప్తారా? లేక రోడ్డు మీదకు వచ్చి మీడియా ముందు గొడవ చేస్తారా? ఇంట్లో సమస్య ఏదైనా ఉండి.. అది తీరనప్పుడు మీ పెద్దల వద్దకు వెళ్తారు. మీడియా ముందు కావాల�