శ్రీ సింహ కోడూరి, సత్య లీడ్ రోల్స్ లో రితేష్ రానా దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హిలేరియర్స్ థ్రిల్లర్ ‘మత్తువదలరా2’. ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించారు. ప్రతిష్టాత్మక బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు ఈ చిత్రాన్ని నిర్మించారు. సెప్టెంబర్ 13న విడుదలైన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షుకులని అలరించిన హిలేరియస్ బ్లాక్ బస్టర్ ని అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్ ని నిర్వహించారు. స్టార్ డైరెక్టర్స్ గోపీచంద్ మలినేని, శివ నిర్వాణ, వివేక్ ఆత్రేయ, అనుదీప్, మహేష్ బాబు హాజరైన ఈ వేడుక గ్రాండ్ గా జరిగింది.
డైరెక్టర్ గోపీచంద్ మలినేని మాట్లాడుతూ.. టీమ్ అందరికీ కంగ్రాట్యులేషన్స్ అండ్ బిగ్ థ్యాంక్స్. థాంక్స్ ఎందుకంటే.. గత 10 డేస్ గా రెండు తెలుగు రాష్ట్రాల్లో వరదలతో కూడిన డిప్రెషన్ లో ఉన్నాం. ఆ డిప్రెషన్ నుంచి బయటకు తీసుకొచ్చే ఫిలిం ఇది. 100% ఇది ఒక మంచి రిలీఫ్. సత్య శ్రీ సింహ థాంక్యూ వెరీ మచ్. జనాలు అందరిలోనూ ఒక మంచి నవ్వును తీసుకువచ్చారు. అందరికీ థాంక్స్ చెప్తున్నాను. ఒక రెండున్నర గంటలసేపు నవ్విస్తూనే ఉన్నారు. అందరికీ హాట్ ఫుల్ గా కంగ్రాచ్యులేషన్స్. మైత్రి మూవీ మేకర్స్ నవీన్ గారికి రవి గారికి, బ్లాక్ బస్టర్ అందుకున్న టీం అందరికీ కంగ్రాట్స్. రెండున్నర గంటలసేపు అన్ని మర్చిపోయి హాయిగా చూడదగ్గ సినిమా ఇది. పార్ట్ 3 కోసం వెయిట్ చేస్తున్నా’ అన్నారు.