Movie గాడ్ ఫాదర్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ కు తాను రాజకీయ మద్దతు ఇచ్చే అవకాశం ఉండొచ్చు అంటూ చెప్పవచ్చు మెగాస్టార్ చిరంజీవి అయితే ఈ విషయంపై మెగా బ్రదర్ నాగబాబు హర్షం వ్యక్తం చేశారు…
గాడ్ ఫాదర్ మూవీ ప్రమోషన్స్ లో బిజీ బిజీగా గడుపుతున్నారు మెగాస్టార్ చిరంజీవి ఈ సమయంలోనే ఓ ప్రెస్ మీట్ లో తన తమ్ముడైన పవన్ కళ్యాణ్ కు భవిష్యత్తులో రాజకీయ మద్దతు ఇస్తానేమో అంటూ చెప్పుకొచ్చారు.. ఈ విషయంతో మెగా అభిమానులు మంచి ఉత్సాహంలో ఉన్నారు మళ్ళీ పవన్ కళ్యాణ్ చిరు కలిసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తమదైన పాత్ర పోషించాలంటూ హర్షం వ్యక్తం చేశారు అయితే ఈ విషయంపై మెగా బ్రదర్ నాగబాబు తన ఆనందాన్ని వెల్లడించారు.. అన్న మెగాస్టార్ మాటలు కోట్లాది మెగా అభిమానులకు ఎంత ఉత్సాహాన్ని కలిగించాయని.. అదేవిధంగా తన తమ్ముడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా మెగాస్టార్ ఆశించిన స్థాయిలో తప్పకుండా రాజకీయాల్లో రాణించాలని హర్షం వ్యక్తం చేశారు అంతేకాకుండా పవన్ కళ్యాణ్ తప్పకుండా సీఎం పదవిని చేపట్టాలని చెప్పుకొచ్చారు..
“జనసేనాని పవన్ కళ్యాణ్ లాంటి నిబద్ధత ఉన్న నాయకుడు పరిపాలన పగ్గాలు చేపట్టాలనే అన్నయ్య గారి ఆకాంక్ష తప్పకుండా నెరవేరుతుంది. జన సైనికులుగా మేమంతా ఆ మహత్ కార్యాన్ని నెరవేర్చి చూపిస్తాం. పవన్ కల్యాణ్ నిజాయితీ, నిబద్ధత తనకు చిన్నప్పటి నుంచి తెలుసనే అన్నయ్య మెగాస్టార్ వ్యాఖ్యలు జనసైనికులకు మనో ధైర్యాన్ని ఇచ్చాయి. భవిష్యత్లో తాను ఏ పక్షాన ఉండాలో ప్రజలే నిర్ణయిస్తారని చిరంజీవి చెప్పిన మాటలకు అనుగుణంగా జనసైనికులంతా మరింత శ్రమించి ప్రజల మన్ననలు పొందుతాం” అని నాగబాబు చెప్పుకొచ్చారు..