Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తండ్రికి తగ్గ తనయుడిగా ప్రేక్షకుల మన్ననలను పొందుతున్నారు. మెగాస్టార్ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చరణ్ దినదినాభివృద్ది చెందుతూ తన కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని క్రియేట్ చేసుకున్నారు. ఇక ఇటీవలే వచ్చిన “ఆర్ఆర్ఆర్” సినిమాలో తన నటవిశ్వరూపానికి ప్రపంచ సినీ ప్రేక్షకులు సైతం ఫిదా అయ్యారని చెప్పొచ్చు. ప్రస్తుతం రామ్ చరణ్ దర్శకుడు శంకర్ తో సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే.
రామ్ చరణ్ కెరీర్ లో 15వ సినిమా గా వస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రానికి జీ స్టూడియోస్ కూడా భాగస్వామిగా వ్యవహరిస్తోంది. అయితే ఎంత ఎదిగిన ఒదిగే ఉండే మాటకు రామ్ చరణ్ చక్కనైన నిదర్శనం అని అతడి మనస్తత్వం గురించి పలు సందర్భాల్లో చాలా మంది ప్రముఖులు చెప్పడం చూశాం.
ఇప్పుడు తాజాగా చరణ్ చిన్ననాటి గురువుని గుర్తుపెట్టుకొని మరి ఇంటికి వెళ్లి కలిసినట్లు తెలుస్తుంది. ఇటీవల రాజమండ్రి పరిసరాల్లో ఆర్సీ15 షూటింగ్ జరుపుకోగా… ఆ సమయంలో తనకి చిన్నప్పుడు చదువు చెప్పిన టీచర్ ఆ చుట్టూ పక్క ప్రాతంలో నివసిస్తున్నారని తెలుసుకున్నాడంట. దీంతో ఆమె ఇంటి అడ్రెస్స్ కనుకొని మరి వెళ్లి చరణ్ ఆమెను కలుసుకున్నాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ వార్త విన్న మెగా ఫ్యామిలీ అభిమానులంతా చెర్రీని తెగ పొగిడేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.