Movie మోహన్ లాల్ నటించిన లూసిఫర్ కు రీమేక్ గా తెరకెక్కిన గాడ్ ఫాదర్ మూవీ అక్టోబర్ ఐదు న విడుదలైన సంగతి తెలిసిందే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రముఖ పాత్రలో నటించిన ఈ చిత్రం అందుకుంది అంతేకాకుండా మీరు తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్లను సాధిస్తుంది..
మెగాస్టార్ చిరంజీవి బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గాడ్ ఫాదర్ ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకులు ముందుకు వచ్చింది. అయితే ఈ చిత్రానికి విశేష ఆదరణ లభిస్తుంది.. మలయాళ చిత్రమైన లూసిఫర్ ఎలా ఉందో అలా కాకుండా కొన్ని మార్పులు చేర్పులు చేశాడు దర్శకుడు మోహన్ రాజ తెలుగు నేటివిటీకి తగినట్టుగా ఈ సినిమాను మలచటంలో మంచి మార్క్ అందుకున్నాడు ఈ దర్శకుడు.. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా మొదటి రోజునే 38 కోట్ల గ్రాస్ ను అందుకున్నట్టు ప్రకటించింది చిత్ర బృందం ఈ విషయంపై హర్షం వ్యక్తం చేశారు గాడ్ ఫాదర్ మూవీ టీం.. అలాగే తెలుగు రాష్ట్రాల్లో 20. 9 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు సమాచారం.. ఈ సినిమా సక్సెస్ తో మెగా అభిమానులు మంచి ఉత్సాహం మీద ఉన్నారు..
మెగాస్టార్ చిరంజీవి సల్మాన్ ఖాన్ నయనతార ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు.. ఇందులో చిరంజీవి పవర్ఫుల్ పొలిటికల్ పాత్రలో కనిపించారు.. రాష్ట్రాన్ని శాసించే ఒక వ్యక్తికి వెనక నుండి నడిపించే శక్తిగా పవర్ఫుల్ పాత్ర పోషించారు.. ఈ వయసులో కూడా ఏమాత్రం ఎనర్జీ తగ్గకుండా చిరు తన ఎనర్జీ లెవెల్స్ ను చూపించారు