Movie మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటించిన లూసిఫర్ కు రీమేక్ గా తెరకెక్కిన గాడ్ ఫాదర్ మూవీ అక్టోబర్ ఐదు న విడుదలైన సంగతి తెలిసిందే.. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రముఖ పాత్రలో నటించిన ఈ చిత్రం మంచి హిట్ టాక్ అందుకుంది.. ఈ రెండు రోజుల్లోనే తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా మంచి గ్రాస్ ను అందుకుంది..
మెగాస్టార్ చిరంజీవి బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గాడ్ ఫాదర్.. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5న ప్రేక్షకులు ముందుకు వచ్చింది. అయితే ఈ చిత్రానికి విశేష ఆదరణ లభిస్తుంది.. ఈ సినిమా విడుదలై రెండు రోజులైంది. ఈ రెండు రోజుల్లో సినిమా కలెక్షన్స్ పరంగా స్పీడు చూపించింది. వరల్డ్ వైడ్గా గాడ్ ఫాదర్ ఫస్ట్ డే రూ. 17.68 కోట్లు షేర్ వసూళ్లను సాధించిన ఈ చిత్రం.. రెండో రోజున రూ.9.67 కోట్లు సాధించింది… తెలుగు రాష్ట్రాల్లో గాడ్ ఫాదర్ సినిమా రూ. 20.70 కోట్లు షేర్ వసూళ్లను రాబట్టింది. దీన్ని గ్రాస్ వసూళ్ల ప్రకారం చూస్తే రూ. 34.75 కోట్లు అని తెలుస్తుంది..
ఓవర్ సీస్ లో రూ. 2.55 కోట్లు వసూలు చేసింది.. అంటే వరల్డ్ వైడ్గా చూస్తే గాడ్ ఫాదర్ చిత్రం రూ. 27.35 కోట్లు షేర్ వసూళ్లను తెచ్చుకుంది. గ్రాస్ ప్రకారం చూస్తే రూ. 50.35 కోట్లు అని సమాచారం.. అయితే.. చిత్ర బృందం గాడ్ ఫాదర్ సినిమాకు రెండో రోజున రూ. 31 కోట్లు కలెక్షన్స్ వచ్చాయి.. అంటే మొత్తంగా రెండు రోజులకు కలిపి రూ. 69 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయని తెలిపింది..