Entertainment మెగా స్టార్ చిరంజీవి ఇటీవలే ‘గాడ్ ఫాదర్’ విజయంతో ఫుల్ జోష్ లో ఉన్నారు. ప్రస్తుతం ఆయన తదుపరి చిత్రాలపై ఫోకస్ పెట్టారు.. అయితే దీపావళి సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి – బాబీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం ‘మెగా154’ నుంచి అభిమానులకు గుడ్ న్యూస్ అందింది. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న చిత్ర టైటిల్ ను ఎట్టకేలకు రిలీజ్ చేయబోతున్నట్టు అధికారికంగా మేకర్స్ అనౌన్స్ చేశారు.
దీపావళి కానుకగా మెగా అభిమానులకు ‘మెగా 154’ నుంచి టైటిల్ టీజర్ ను లాంచ్ చేయనున్నట్టు ప్రకటించారు. అక్టోబర్ 24న ఉదయం 11.07 గంటలకు ఈ అప్డేట్ అందుతుందని తెలిపారు. ఎప్పటి నుంచో ఈ చిత్ర టైటిల్ కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. అయితే మెగా లీక్స్ ద్వారా ‘వాల్తేరు వీరయ్య’గా టైటిల్ రివీల్ అయ్యింది. మరో ఈవెంట్ లో బాబీ కూడా అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అధికారికంగా టైటిల్ ను ప్రకటించబోస్తున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ కూడా గూస్ బంప్స్ తెప్పిస్తోంది. వింటేజ్ చిరును చూపిస్తోంది.
దర్శకుడు బాబీ (కెఎస్ రవీంద్ర) డైరెక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నారు. మెగా మాస్ మరియు కమర్షియల్ ఎంటర్‌టైనర్ గా ‘మెగా154’ను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో భారీ యాక్షన్ సీక్వెన్స్‌ని తెరకెక్కిస్తున్నారు. మాస్ మహారాజా రవితేజ ఈ సినిమాలో పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నాడు. మునుపెన్నడూ లేని విధంగా కమర్షియల్ బొనాంజా అందించడానికి మెగా మాస్ పూనకాలు లోడ్ అవుతున్నాయి. హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తోంది. సినిమాను 2023 సంక్రాంతికి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.