Entertainment మెగాస్టార్ చిరంజీవి.. కెరీర్ ప్రారంభంలోనే టాలీవుడ్ హాస్యనటుడు అల్లు రామలింగయ్య గారి కుమార్తె అయిన సురేఖ గారిని వివాహం చేసుకుని.. ఓ ఇంటివాడయ్యారు.. మీరు వివాహం 1980 ఫిబ్రవరి 20న జరిగింది అంటే దాదాపు 42 ఏళ్ళు గడుస్తుంది ఇన్నాళ్లు చిరంజీవికి తోడునీడగా కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ అన్యోన్య దాంపత్యాన్ని కొనసాగించారు సురేఖ గారు ముగ్గురు పిల్లలతో పాటు కుటుంబ బాధ్యతలు కూడా ఎంతో సక్రమంగా నడుపుకుంటూ వచ్చారు అయితే చిరంజీవి సురేఖ గారిని పెళ్లి చేసుకోవాలి అని అనుకోలేదంట తాజాగా ఈ విషయంపై నోరు విప్పారు చిరు..
అప్పటికి తను కేవలం నాలుగైదు సినిమాల్లో మాత్రమే నటించానని అయితే తన మామగారైన అల్లు రామలింగయ్య గారు ఓ సినిమా షూటింగ్లో చూసి తను అల్లుడుగా చేసుకోవాలని అనుకున్నారని చెప్పారు ప్రతి విషయంలో తనను అల్లు రామలింగయ్య గారు గమనిస్తూ ఉంటే ఏమో అనుకున్నాను అని కానీ ఆయన మనసులో ఇంత దూరం ఆలోచన ఉందని తెలియలేదని అన్నారు అంతేకాకుండా పెళ్లి ప్రస్తావన తన వరకు వచ్చినప్పుడు ఇప్పుడే జీవితంలో స్థిరపడుతున్న అప్పుడే నాకు పెళ్లెందుకు అని అన్నారని అయితే అందుకు ఒప్పుకొని అల్లు వారు ఏకంగా చిరంజీవి గారి నాన్న గారి దగ్గరికి వెళ్లి పెళ్లి ప్రస్తావన తెచ్చారంట సినిమా ఇండస్ట్రీ అంటేనే ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేము తొందరగా పెళ్లి చేసేయటం మంచిది. మంచి కుటుంబం మంచి అమ్మాయి మీరే ఆలోచించుకోండి అంటూ మధ్యవర్తిగా ఓ దర్శకుని చిరంజీవి నాన్నగారు దగ్గరికి పంపించారంట ఈ విషయంపై చాన్నాళ్లు వాదనలు జరిగాక ఓసారి పెళ్లి చూపులు ఏర్పాటు చేశారని అయితే అందులో సురేఖను చూశాక ఊ అనాలి అనిపించినా మళ్లీ కెరీర్ కోసం ఆలోచించి ఆగిపోయానని చెప్పారు.. తర్వాత మళ్ళీ కొన్ని రోజులకి వాళ్ళ ఇంటికి వెళ్లి ఈసారి సురేఖ గారిని చూసి నువ్వు చెప్పలేక ఎస్ చెప్పుకొచ్చానని అన్నారు అంతేకాకుండా పూర్తిగా తమ అభిప్రాయం కూడా తీసుకోకుండా అందరూ అప్పటికప్పుడే పట్టు పట్టి మూడు రోజుల్లో పెళ్లి సత్సంగం మొత్తం కానిచ్చేసారని చెప్పారు అయితే పెళ్లినాటి నుంచి అల్లు రామలింగయ్య గారు తన సొంత కొడుకులా చూసుకుంటూ వచ్చారని గుర్తు చేసుకున్నారు..