Entertainment టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి తాజాగా నిజం విత్ స్మిత టాక్ షోకు వచ్చిన సంగతి తెలిసిందే ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలు పంచుకున్న మెగాస్టార్ తను పనిచేసిన హీరోయిన్ల కోసం చెప్పుకొచ్చారు..
స్మిత టాక్ షోలో మీరు స్క్రీన్ పంచుకున్న హీరోయిన్ లో ఎవరు బెస్ట్ అంటూ స్మిత ప్రశ్నించగా దానికి మెగాస్టార్ తనదైన శైలిలో చెప్పుకొచ్చారు.. అలాగే రాధికా శరత్ కుమార్, రాధ, విజయ శాంతి, శ్రీ దేవి లాంటి స్టార్లలో ఎవరు బెస్ట్ అంటే చెప్పడానికి మెగాస్టార్ నిరాకరించారు. అందరితోనూ తనకు మంచి రిలేషన్ ఉందని.. మా మధ్య అద్భుతమైన కెమిస్ట్రీ ఉండేదని చెప్పుకొచ్చారు. అలాగే ప్రతి ఒక్కరిలోనూ కొన్ని ప్రత్యేకతలు కచ్చితంగా ఉన్నాయని చెప్పాలని తెలిపారు..
సులభంగా, సహజంగా నటించే విషయంలో రాధిక ఫర్‌ఫెక్ట్.. ఇక నాతో డ్యాన్స్ విషయంలో అయితే రాధ, విజయశాంతి జీవించేస్తారని అన్నారు. ఆ విషయంలో వారిద్దరి డ్యాన్స్ పవర్‌ఫుల్‌గా ఉంటుందన్నారు. అయితే శ్రీ దేవితో గొప్ప వ్యక్తిగత, వృత్తిపరమైన రిలేషన్ పంచుకున్నానని వెల్లడించారు. అందువల్ల ఆమె ఎల్లప్పుడూ తన ఫేవరేట్ హీరోయిన్ అని చిరంజీవి పేర్కొన్నారు. అలాగే శ్రీదేవి గురించి మాట్లాడుతూ..’ ఆమెతో పని చేసిన ప్రతి క్షణాన్ని ఆస్వాదించా. తెలుగు సినిమాల్లో తమ జంట ఇప్పటికీ కూడా ఉత్తమ జంటగానే పరిగణిస్తారు. శ్రీదేవి నటన, డ్యాన్స్ బెస్ట్. అందుకే ఆమెతో ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, ‘మోసగాడు’, ‘ఎస్పీ పరశురామ్’ లాంటి సూపర్ హిట్ సినిమాలు చేయగలిగా.. ‘ అంటూ చెప్పు కొచ్చారు మెగాస్టార్