Political ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశాడు మంత్రి సీదిరి అప్పలరాజు.. ఏపీలో ముందస్తు ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చు అని అందరూ సిద్ధంగా ఉండాలని ఆ పార్టీ నేతలను సూచించారు..
శ్రీకాకుళం జిల్లా పలాస పట్టణంలో మంత్రి అప్పలరాజు నూతన క్యాంపు కార్యాలయాన్ని జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ప్రారంభించారు. అయితే సందర్భంగా అప్పలరాజు వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలకు ఎన్నో చేసిందని తర్వాత రాజకీయాల్లో కూడా కీలకపాత్ర పోషించనుందని చెప్పారు.. పరిస్థితి ఎలా ఉన్నది ప్రజల పక్షం నిలబడటానికి వెనకాడమని ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి తీరుతామని చెప్పుకొచ్చారు..
“మీ అందరి కోసం చాలా అండగా నిలబడతా. ఎలాంటి సమస్య ఉన్నా, ఏ రాత్రి అయినా నా తలుపు తట్టవచ్చు. నా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. మీ సోదరుడు డాక్టర్ సీదిరి అప్పలరాజు ఎలాంటి తప్పు చేయడు.. ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చు. సంసిద్ధంగా ఉండండి.. తమ ప్రభుత్వంపై జనంలో పిసరంత కూడా వ్యతిరేకత లేదు.. పడిలేస్తున్న కెరటమే నాకు ఆదర్శం ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీదే విజయం.. ” అని చెప్పుకొచ్చారు.. చిన్నతనం నుంచి తాను సముద్రం తీరంలో పెరిగానని.. సముద్రమే తనకు ఆదర్శమని అప్పలరాజు చెప్పారు. ‘పడి లేస్తున్న కెరటాలే నాకు ఆదర్శం. మీ తోడు ఉన్నంతవరకూ డాక్టర్ అప్పలరాజును ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఈ జీవితం మీది’ అని ఆయన అన్నారు. ప్రతిపక్షాలతో పాటు ఆ పార్టీలకు వంత పాడుతున్న మీడియా కూడా తనను ఏమీ చేయలేవని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు.