Minister Hareesh Rao, Yaction Aid Foundation, Telangana News, Telugu World Now,
Telangana Political News: యాక్షన్ ఎయిడ్’ సాయం అభినందనీయం: మంత్రి హరీశ్ రావు.
*రూ.20 లక్షల విలువైన 10 లీటర్లు, 5 లీటర్ల సామర్థ్యం కలిగిన కాన్సెంట్రేటర్లను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావుకు అందజేసిన యాక్షన్ ఏయిడ్ సంస్థ*
సిద్ధిపేట 18 జూలై 2021:
కోవిడ్ ఉధృతి నేపథ్యంలో రోగులకు ఆక్సిజన్ ఎంతో ముఖ్యమని, అలాంటి ఆక్సిజన్ అందించే ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లను క్లిష్ట సమయంలో తమ వంతు సామాజిక బాధ్యతగా యాక్షన్ ఏయిడ్ సంస్థ ఉచితంగా ఇవ్వటం అభినందనీయమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ హరీశ్ రావు పేర్కొన్నారు.
ఆదివారం ఉదయం సిద్ధిపేటలోని మంత్రి నివాసంలో యాక్షన్ ఏయిడ్ సంస్థ రీజనల్ మేనేజర్ ఆంజనేయులు, ప్రోగ్రామ్ ఆఫీసర్ ఫణీంద్ర, జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ ప్రతినిధి శంకర్ లు మంత్రిని కలిసి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ క్రింద 10 లీటర్ల సామర్థ్యం కలిగిన 20 కాన్సెంట్రేటర్లు, 5 లీటర్ల సామర్థ్యం కలిగిన 10 కాన్సెంట్రేటర్లు మొత్తం
రూ.20 లక్షల విలువైన ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ లను అందించారు.
యాక్షన్ ఏయిడ్ ప్రతినిధుల నుంచి స్వీకరించిన వెంటనే మంత్రి వాటిని ఆక్సీజన్ అవసరమయ్యే ప్రభుత్వ ఆసుపత్రులు, గ్రామీణ ప్రాంతాల్లోని పీహెచ్ సీ, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో కొవిడ్ బాధితుల కోసం వినియోగించాలని, ఓఎస్డీ బాలరాజుకు సూచించారు.
చాలామంది కొవిడ్ రోగులకు ఆసుపత్రిలో ఆక్సిజన్ తో చికిత్స అందించినప్పటికి వారి ఇళ్లకు వెళ్లి న తర్వాత ఇబ్బంది పడకుండా ఇలాంటి ఆక్సిజన్ కాన్సెంట్రేట్ ల ద్వారా భయం లేకుండా చికిత్స అందించవచ్చు అని తెలిపారు. యాక్షన్ ఏయిడ్ సంస్థ స్ఫూర్తిగా తీసుకుని సిద్దిపేట జిల్లా లోని మరిన్ని కార్పొరేట్ సంస్థ లు ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ ల ను ఉచితంగా అందివ్వాలని మంత్రి హరీశ్ రావు పిలుపు నిచ్చారు.
*నిరు పేదలకు సాయం.. సీఏం సహాయ నిధి..*
*చెక్కులను వెంటనే తమ బ్యాంకుఖాతాలో జమ చేసుకోవాలని లబ్ధిదారులకు సూచన*
ముఖ్యమంత్రి సహాయనిధి నిరు పేదలకు ఓ వరమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. ఆదివారం ఉదయం సిద్ధిపేటలోని మంత్రి నివాసంలో సిద్ధిపేట నియోజకవర్గ పరిధిలోని 32 మంది లబ్ధిదారులకు రూ.9 లక్షల 96 వేల 500 రూపాయల విలువ కలిగిన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరుపేదలు సాయం.. పొందేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు అండగా నిలుస్తున్నదని చెప్పడానికి సిద్ధిపేట నియోజకవర్గమే నిదర్శనమని మంత్రి చెప్పారు. చెక్కులను వెంటనే తమ బ్యాంకు ఖాతాలో జమ చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు.
ఈ మేరకు తొగుట మండలం గుడికందుల గ్రామానికి చెందిన బాలయ్యకు రూ.85 వేల రూపాయల ఎల్ఓసీ పత్రాన్ని మంత్రి చేతుల మీదుగా అందించారు.
కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ పాల సాయిరాం, సుడా డైరెక్టర్ మచ్చవేణుగోపాల్, పలువురు మున్సిపల్ కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.