జీహెచ్ ఎంసీ నూతన మేయర్, డిప్యూటీ మేయర్లకు శుభాకాంక్షలు
జీహెచ్ఎంసీ నూతన మేయర్ గా ఎన్నికైన గద్వాల విజయలక్ష్మి, డిఫ్యూటీ మేయర్ గా ఎన్నికైన మోతె శ్రీలత శోభన్ రెడ్డిలకు రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు గారు శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ నగర ప్రతిష్ట పెంచేలా ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మార్గనిర్దేశనంలో ముందుకుసాగాలని ఆకాంక్షించారు.