Monitha in BiggBoss 7: తెలుగు రాష్ట్రాల్లో బిగ్‌బాస్(BiggBoss) కు ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు. విజయవంతంగా ఆరు సీజన్లు పూర్తి చేసుకుంది. త్వరలోనే సీజన్ 7 ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి బుల్లితెరపై అప్పుడే సందడి మొదలైంది. టైటిల్ లోగో, టీజర్‌ను రివీల్ చేశారు. వరుసగా అప్‌డేట్స్ ఇస్తున్నారు. ఈ సీజన్‌కు కూడా నాగార్జున(Nagarjuna)నే హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. న్యూ గేమ్, న్యూ ఛాలెంజెస్, న్యూరూల్స్ అంటూ షో పై మరింత ఆసక్తిని పెంచారు కింగ్ నాగ్.
ఇక ఈ సీజన్‌లో పాల్గొనే కంటెస్టెంట్స్ ఎవరనేది హాట్ టాఫిక్‌గా మారింది. ఇప్పటికే లిస్ట్ కూడా ఫైనలైజ్ అయ్యిందని తెలుస్తోంది. క్రికెటర్, రియల్ లైఫ్ కపుల్స్, పలువురు సీరియల్స్ నటీనటులు ఈ సీజన్‌లో కంటెస్టెంట్స్‌గా వస్తున్నట్లు ఓ లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు శోభా శెట్టి(Shobha Shetty). ఇలా పేరు చెబితే గుర్తు పట్టే వారి సంఖ్య తక్కువ గానీ.. కార్తీక దీపం మోనిత(Karthika Deepam Monitha) అంటే వెంటనే గుర్తు పట్టేస్తారు.
మోనిత పాత్రలో తనదైన విలనిజాన్ని పండించి ప్రేక్షకుల మదిలో చెదరని ముద్ర వేసింది. ఆమెకు సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్‌ఫాలోయింగ్ ఉంది. దీంతో ఈమెను ఈ సారి బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా తీసుకున్నట్లుగా ఓ ప్రముఖ బిగ్‌బాస్ రివ్యూవర్ చెబుతున్నారు. ఆమెకు భారీగానే పారితోషికం ఆఫర్ చేశారట. వారానికి రూ.1.25 లక్షల నుంచి 1.5లక్షల వరకు పారితోషికం ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంత నిజం ఉందనేది అటు మోనితా గానీ లేదా బిగ్‌బాస్ బృందం స్పందిస్తే గానీ తెలియదు. ఇక ఆగస్ట్ చివరి వారంలో గానీ లేదంటే సెప్టెంబర్ మొదటి వారంలోగానీ బిగ్‌బాస్ సీజన్ 7 ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.