ఇటీవల గచ్చిబౌలిలోని హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయ అవరణలోని SATS షూటింగ్ రేంజ్ లో నిర్వహించబడిన తెలంగాణ రాష్ట్ర తొమ్మిదవ షూటింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలు నిర్వహించారు.
ఈ షూటింగ్ లో రాచకొండ పోలీస్ కమిషనరేట్ లోని ఐటీ & కమ్యూనికేషన్స్ విభాగంలో ఇన్స్పెక్టర్ గా పని చేస్తున్న ఎ. ప్రసన్న కుమార్, 25 మీటర్ల సెంటర్ ఫైర్ పిస్టల్ విభాగంలో బంగారు పతకం సాధించారు. అలాగే 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో కాంస్య పతకం సాధించడం జరిగింది.
ఈ సందర్భంగా ఈరోజు నెరేడ్ మెట్ కమిషనరేట్ లోని కమిషనర్ కార్యాలయంలో సీపీ డిఎస్ చౌహాన్ ఐపీఎస్ గారు విజేత అయిన ప్రసన్న కుమార్ ను అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని పోటీల్లో పాల్గొని ఎన్నో పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ తరపున అన్ని రకాల తోడ్పాటు అందిస్తామని తెలిపారు.