entertainment బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కామరూన్ దర్శకత్వంలో పోతున్న అవతార్ టు చిత్రంపై ఇప్పటికే ఎన్నో రికార్డ్స్ క్రియేట్ అయ్యాయి అలాగే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 160 దేశాల్లో డిసెంబర్ 16న గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది .. 2009 లో వచ్చిన అవతార్ చిత్రం ఎంత హిట్ అయిందో తెలిసిందే ఈ సినిమాను తెలుగులో కూడా చాలా బాగా ఆదరించారు అయితే దాదాపు 13 ఏళ్ల క్రితం ఇప్పుడు అవతార్ 2 చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. అలాగే మానవుల కారణంగా ‘పాండోరా’ను కోల్పోయిన నావీ తెగ ఎటు పయనించింది. సముద్రంతో అనుబంధం ఎలా ఏర్పడింది? అక్కడ వారికి ఎదురైన పరిస్థితులు ఏంటి? తదితర విషయాలను ‘అవతార్2’లో చూపించనున్నారు.
అలాగే తమిళ్ హీరో అరుణ్ విజయ్ నటించిన క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ఆక్రోశం’ డిసెంబరు 16న విడుదల చేస్తున్నారు. ఇందులో అరుణ్ విజయ్ పోలీస్ ఆఫీసర్‌గా నటించాడు. జీఎన్‌ఆర్ కుమరవేలన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అరుణ్ విజయ్‌కి జోడీగా పలక్ లాల్వానీ నటిస్తోంది.
అలాగే ఇదే రోజున అల్లు వంశీ, ఇతి ఆచార్య హీరో-హీరోయిన్లుగా పరిచయమైన చిత్రం ‘పసివాడి ప్రాణం’. ఎన్.ఎస్.మూర్తి దర్శకుడు. తెలుగులో ఇప్పటివరకూ రాని వినూత్నమైన ‘లైవ్ కమ్ యానిమేషన్’ టెక్నాలజీతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. చిరంజీవి ‘పసివాడి ప్రాణం’లో నటించి మెప్పించిన ఇప్పటి సీరియల్ నటి సుజిత ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు.
అలాగే ఇదే రోజు విడుదల కాబోతున్న మరొక చిత్రం శాసనసభ.. ఇంద్రసేన, ఐశ్వర్యరాజ్ జంటగా వేణు మడికంటి తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం ఇది… తులసీరామ్ సాప్పని, షణ్ముగం సాప్పని సంయుక్తంగా నిర్మించారు. రాజేంద్రప్రసాద్, సోనియా అగర్వాల్ కీలక పాత్రలు పోషించారు.