Entertainment మృణాల్ ఠాగూర్.. సీతారామం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ భామ.. దుల్కర్ సల్మాన్ సరసన సీతగా ఒదిగిపోయిన మృనాల్ తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం వరుస అవకాశాలతో సినీ ఇండస్ట్రీలో అగ్రనాయికగా దూసుకుపోతుంది.. అయితే తాను ఈ స్థాయిలో ఉండటానికి ఉండటం అంత తేలిగ్గా జరిగిన పని కాదని.. ఎన్నో కష్టాలను దాటుకొని వచ్చి ఈరోజు ఈ స్థాయిలో నిలబడ్డారని అంటుంది ఈ భామ..
దుల్క సల్మాన్ సరసన మృణాల్ ఠాగూర్ నటించిన సీతారామ మూవీ సూపర్ హిట్ అయింది ఈ మూవీ 100 కోట్లకు పైగా వసూళ్లను సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.. అయితే తాను ఈరోజు ఈ స్థాయిలో ఉండటానికి తాను ఎన్నో కష్టాలు పడ్డాను అంటోంది మృణాల్.. కుంకుమ భాగ్య సీరియల్ తో నా జీవితాన్ని ప్రారంభించింది ఈ హీరోయిన్.. తర్వాత సల్మాన్ ఖాన్ నటించిన సుల్తాన్ మూవీలో మొదటిగా మృణాలను హీరోయిన్ గా అనుకున్నారు తర్వాత ఆమె స్థానంలో అనుష్క శర్మన్ తీసుకోవడంతో చాలా బాధపడ్డాను అని చెప్పుకు వచ్చింది..
లవ్ సోనియా సినిమాలో అక్రమ రవాణాకి బలైన చెల్లిని కాపాడుకునే అక్కగా కనిపించింది మృణాల్. అయితే ఇందులో చెల్లిని కాపాడుకోవడానికి వేశ్య అవతారం ఎత్తాల్సి ఉంటుంది.. ఈ సినిమా కోసం కోల్కతాలోని ఓ వేశ్య గృహంలో రెండువారాలు ఉందట మృణాల్. ఆ సమయంలో అక్కడ వాళ్ళతో గడిపి వారి కథలు విని చెలించిపోయిందట.. అక్కడినుండి వచ్చేసక కూడా వాళ్ళ కథలే వెంటాడాయట. ఆ సమయంలో డిప్రషన్ లోకి కూడా వెళ్లాను అంటూ చెప్పుకొచ్చింది.